రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై చంద్రబాబు ఈ రోజు స్పందించారు. ఆయన మాటల్లో "వైకాపా నేతలు, మంత్రులు రోజుకో మాట మాట్లాడి ప్రజలను గందర గోళానికి గురిచేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఆరోజు.. ఈరోజు ఎప్పుడైనా అమరావతి ప్రజారాజధానే. రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలుగా రాజధానిపై మీన మేషాలు లెక్కించింది. 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన వనరులు, ఆదాయం సమకూర్చే రాజధాని అమరావతి. రాజధాని నిర్మాణానికి రూ.లక్షా తొమ్మిదివేల కోట్లు అవసరమని చెబుతున్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెబుతున్నారు. అమరావతి కోసం మా ప్రభుత్వం రూ.9,165 కోట్లు ఖర్చు చేసింది. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఇప్పటికే అమరావతిలో ఉన్నాయి. ల్యాండ్‌ పూలింగ్‌ అనేది వినూత్నమైన ఆలోచన. అమరావతిలో భూములు ఇచ్చింది ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులే. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులు 20,490 మంది ఉన్నారు. అమరావతిలో రాజధాని లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక అవకతవకలు జరిగాయని ప్రచారం చేస్తున్నారు’’

media 27122019 2

అయితే ఇదే సందర్బంలో చంద్రబాబు, హైదరాబాద్ మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. "రైతులని పైడ్ ఆర్టిస్ట్ లు అని కొన్ని మీడియా చానల్స్ కూడా వేస్తున్నాయి. గవర్నమెంట్ కు భజన చెయ్యాలి అంటే చెయ్యండి. హైదరాబాద్ ని అభివృద్ధి చెయ్యాలి అనుకుంటే, అలాంటి టీవీలు అక్కడ చేసుకోండి. మీకు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే చేసుకోండి. ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే పరిస్థితి వస్తే మంచిది కాదు. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఇంట్రెస్ట్ కాపాడుకోవటానికి, ఇక్కడ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగాలి అంటే ఊరేగండి. కాని ఇక్కడ ప్రజలని అవమానం చేస్తే మాత్రం, అది మీకు మంచిది కాదు. ఆ విషయంలో మీకు హెచ్చరిస్తున్న. పేద వాళ్ళ పొట్ట కొట్టి, మీ పొట్ట నింపుకోవాలని అనుకోవటం, ఇక్కడ ప్రజలకు ద్రోహం చేసి, నష్టం జరిగితే, మీ ఆస్థులు హైదరాబాద్ లో పెరుగుతాయని, దురుద్దేశంతో ప్రవర్తిస్తే మాత్రం, ఇది మంచి పద్దతి కాదు. "

media 27122019 3

"మేము కూడా అవన్నీ చెప్పాలి అంటే మాత్రం మొత్తం చెప్తాను. ఈ ప్రాంత బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మీ వ్యాపారం కోసం, మీ ఆస్థులు పెంచుకోవటం కోసం, ఇక్కడ ఇష్టానుసారంగా చెయ్యద్దు టీవీలు పెట్టుకుని. డబ్బులు ఉన్నాయని, ఆ టీవీలు పెట్టుకుని, ఇస్తాను సారం, ప్రజలను అవమానం చేస్తే, తిరిగి దానికి వడ్డీతో సహా పే చెయ్యాల్సి వస్తుంది మీరు. గుర్తు పెట్టుకోవాలి మీరు. ప్రజలు కూడా, ఇవన్నీ ఆలోచించుకోవాలి, ఏ టీవీ మన రాష్ట్రం గురించి మంచిగా చెప్తుంది. ఎవరికీ ఏ ఇంటర్స్ట్ ఉంది. ఎవరూ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు., వాళ్ళందరినీ, ఆ టీవీలు అందరినీ ప్రజలు గుర్తించాలి."

Advertisements

Advertisements

Latest Articles

Most Read