తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ అనే పేరు ఉండేది. నాయకత్వం ఏది చెప్తే, అదే శాసనం. అయితే కాలం మారిందో, పద్ధతులు మారుతున్నాయో, లేకపోతే చంద్రబాబు ఏమి అనరులే, ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు అనే ధీమా నో కాని, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారు. ఎన్నికల టైములో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా అడుగులు వెయ్యాలని, చంద్రబాబు ప్రతి పని సమీక్షిస్తూ, ఒక పధ్ధతి ప్రకారం చేస్తుంటే, నేతలు మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ చంద్రబాబుకు తలనొప్పులు తీసుకు వస్తున్నారు. అసలకే అటు బీజేపీ, కేసీఆర్, జగన్, పవన్ కలిసి, ఆయాన మీద పడుతుంటే, వాటిని ఎదుర్కోవటంలో, సహాయం చెయ్యల్సింది పోయి, వీరు కూడా ఇబ్బంది పెడుతున్నారు.
టీడీపీలో నేతల వ్యక్తిగత ప్రకటనలు చంద్రబాబుకి తలనొప్పిగా మారుతున్నాయి. టీజీ వెంకటేష్ ఎపిసోడ్ మరువక ముందే తెరపైకి జలీల్‌ఖాన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తెకు ఇచ్చారంటూ జలీల్‌ఖాన్ ప్రకటించడంపై స్థానిక నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి వారే సీట్లు ప్రకటించుకోవడం ఏంటంటూ జలీల్‌ఖాన్‌పై చంద్రబాబుకు ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్‌మీరా ఫిర్యాదు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా జలీల్‌ఖాన్ కుమార్తెను చంద్రబాబు ప్రకటించలేదని నాగుల్ మీరా అన్నారు. జలీల్‌ఖానే తనకు తానుగా అభ్యర్థిని ప్రకటించారని చెప్పారు.
మా వర్గీయులు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారని వెల్లడించారు. తమను సంప్రదించకుండా చంద్రబాబు అభ్యర్థిని ప్రకటిస్తారని మేము అనుకోవడం లేదని వెల్లడించారు. గురువారం తమ వర్గీయులతో కలిసి చంద్రబాబును కలవబోతున్నామని స్పష్టం చేశారు. ఇక మరో పక్క టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే లేపాయి. పవన్, మాతో కాలుస్తాడని, కలిసి పోటీ చేస్తామంటూ ఆయన చేసిన ప్రకటన పై, పెద్ద ఎత్తున దుమారం రేపింది. పవన్ కళ్యాణ్ కూడా టీజీ వెంకటేష్ కు ఘాటుగా బదులు ఇచ్చారు. మరో పక్క చంద్రబాబు కూడా, టీజీ పై ఫైర్ అయ్యారు. పొత్తులు లాంటి విషయాలు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు అలోచించాలాని, క్యాడర్ ను గందరగోళ పరచవద్దు అంటూ బదులిచ్చారు.