ఉపాధి హామీ పనులకు పెండింగ్ బిల్లుల చెల్లింపు పై, ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు మండిపడ్డారు. 2019 జూన్ 1 తరువాత ఇచ్చిన ఎఫ్ టివోల కే బిల్లులు చెల్లించాలని పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మెమో ఇవ్వడం గర్హనీయం అని చంద్రబాబు అన్నారు. ఒకవైపు కేంద్రమార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ, మరోవైపు ఆ మార్గదర్శకాలను పాటించి చెల్లించాలని మెమోలో పేర్కొనడం దివాలాకోరుతనం అని, చేసిన పనులకు ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లించాల్సివుండగా ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం నరేగా చట్టానికే వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. నరేగా చట్ట స్ఫూర్తికి విరుద్దంగా వైసిపి ప్రభుత్వ ఆదేశాలు ఉండటం పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఇప్పటికే అనేక లేఖలు రాసిన విషయం గుర్తు చేశారు. నరేగా కౌన్సిల్ సభ్యులు ఇప్పటికే కేంద్రమంత్రికి, గవర్నర్ కు, ముఖ్యమంత్రికి, సదరు శాఖా కార్యదర్శి, కమిషనర్లకు అనేక వినతులు పంపడం జరిగిందని అన్నారు.

narega 06012020 2

అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడం శోచనీయమని, దీనిపై కేంద్రమంత్రి ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించక పోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోతే 12% వడ్డీతో సహా చెల్లించాలని నరేగా చట్టంలో ఉందని కేంద్రమంత్రి లేఖలో హెచ్చరించినా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బిల్లులు చెల్లించకుండా పనులు చేసినవారిని వేధించడం గతంలో లేదని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్ఫూర్తినే కాలరాసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. గ్రామాల్లో అభివృద్ది పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాని దుస్థితి తెచ్చారని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 5ఏళ్లలో రూ.32వేల కోట్ల పైబడిన నిధులతో గ్రామాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది చేశామని, కానీ వైసిపి ప్రభుత్వం వచ్చాక గత 7నెలలుగా ఈ పనులన్నీ స్థంభించాయిని చంద్రబాబు అన్నారు.

narega 060120203

ఏడాదికి రూ.7వేల కోట్ల చొప్పున గత 5ఏళ్లలో పనులు జరగ్గా ఈ ఏడాది అందులో సగం కూడా వ్యయం చేయక పోవడం వైసిపి ప్రభుత్వ చేతగానితనమే అని, జాతిపిత మహాత్మాగాంధీ పేరుతో రూపొందించిన కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకానికి ఈ విధంగా తూట్లు పొడవడం వైసిపి నేతలకు జాతిపిత పట్ల ఏపాటి గౌరవం ఉందో విదితం అవుతోందని చంద్రబాబు అన్నారు. గ్రామీణాభివృద్ది కన్నా రాజకీయ కక్ష సాధింపే వైసిపి నేతలకు ప్రాధాన్యంశంగా రుజువు అవుతోందిని చంద్రబాబు అన్నారు. ‘‘ముందు చేసిన పనులకు ముందుగా చెల్లింపులు జరపాలన్నదే’’ నరేగా చట్ట స్ఫూర్తి, నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడితే వాళ్లకు 12% వడ్డితో సహా బకాయిలు చెల్లించాల్సి వుంది, కాబట్టి జరిగిన పనులకు జరిగినట్లుగా చెల్లింపులు జరపాలని, ఉద్దేశ పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన జాప్యానికిగాను 12% వడ్డీతో సహా ఆయా పనులు చేసినవారికి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read