ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరో సంచలనానికి తేర లేపారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే తపించే చంద్రబాబు చంద్రబాబు, ఇటీవల వరదల వల్ల చనిపోయిన వారికి ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు, ఇల్లు పోయిన వారికి రూ.5 వేలు ప్రకటించారు. అయితే తాము ప్రతిపక్షంలో ఉన్నా చేతనైన సాయం చేసామని, ఇప్పుడు ప్రభుత్వం చనిపోయిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలని, ఇళ్లు పూర్తిగా కట్టి ఇవ్వాలి అంటూ, డిమాండ్ చేసి, ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెడుతూ, సంచలన చాలెంజ్ చేసారు. చంద్రబాబు మాటల్లో, "ఇది ప్రభుత్వ వైఫల్యం. ముందు వాతవరణ శాఖ హెచ్చరికలు ఇచ్చినా, జాగ్రత్తలు లేవు. ముందుగానే ప్రభుత్వం ప్రజలను అప్రమత్తత చేసి ఉంటే, ప్రాణ నష్టం ఉండేది కాదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్ధత వల్ల, చాలా మంది కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. ఆస్తులు పోగుట్టుకున్నారు. పశు సంపద పోగుట్టుకున్నారు. ఇంట్లో ఉండే వస్తువులు, డబ్బులు పోయాయి. మొత్తంగా ప్రజలు రోడ్డున పడ్డారు. అందరికీ పునరావాసం కల్పించి, అందరినీ ఆదుకోవాలి. అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పటికీ కొన్ని మృతదేహాలు బురదలో కూరుకుపోయాయి. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుపున మరణించిన వారికి లక్ష రూపాయాలు ఇస్తున్నాం, ప్రతి ఫ్యామిలీకి రూ.5 వేలు ఇస్తున్నాం."

cbn 2 23112021 2

"ఇది మా పార్టీ తరుపున మేము ప్రజలను ఆదుకోవటానికి చేస్తున్న సాయం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చనిపోయిన వారికి రూ.25 లక్షలు ఇవ్వాలి. ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నా. ఇది మీ ఫెయిల్యూర్ మాత్రమే. ముఖ్యమంత్రి ఇక్కడకు రావాలి. ఇక్కడే ఉండాలి. మొత్తం సెట్ చేసిన తరువాతే వెళ్ళాలి. గాల్లో తిరిగితే సమస్యలు పరిష్కారం కావు. ఫంక్షన్లకు వెళ్తే, సమస్యలు పరిష్కారం కావు. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే. అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో సమయానికి నీరు విడుదల చేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదు. అమరావతిలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నాడు. చౌకబారు పనులు చేస్తున్నాడు. ప్రజలు ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతూ ఉంటే, ఆడుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం, అమరావతిలో కూర్చుని, మూడు రాజధానుల పై వెనక్కు వెళ్ళటం, శాసనమండలి బిల్లు వెనక్కు తీసుకోవటం, ప్రజల పై భారాలు వేయటంలో బిజీగా ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, భూమి మీద తిరిగాడు, ఇప్పుడు గాల్లో తిరుగుతున్నాడు. అసెంబ్లీలో ఇవేమీ మాట్లాడకుండా, నా భార్య పైన కామెంట్స్ చేసాడు. ఈ దుర్మార్గులు ఇవేమీ మాట్లాడకుండా, నా భార్య మీద వరకు వచ్చారు. నా పైన బూతులు తిట్టినా, మా ఇంటి పైన దా-డి చేసినా, పార్టీ ఆఫీస్ మీదకు వచ్చినా, అరెస్ట్ లు చేసినా, నేను అన్నీ ఎదుర్కున్నా, కానీ భార్యని అంటే తట్టుకోలేక పోయాను."

Advertisements

Advertisements

Latest Articles

Most Read