ఈ రోజుతో 40 ఏళ్ళ రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న చంద్రబాబు, టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు... ఈ సందర్భంగా, మీకు ప్రధాని అయ్యే అవకాశం మళ్ళీ వస్తే, ఏమి చేస్తారు అని అడగగా, చంద్రబాబు రాష్ట్రం పై తనకున్న కమిట్మెంట్ ఎలాంటిదో చెప్పారు... ప్రధాని అయ్యే అవకాశం రాదు, వచ్చినా అవసరం లేదు.. ఆంద్రప్రదేశ్ ని ఓక మోడల్ స్టేట్ గా తయారు చేయాలి, అదే నా ముందు ఉన్న ఆశయం... అవి తప్ప, నాకు వేరే ఆలోచనలు లేవు... ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ కావలి, దాని కోసమే నేను కష్టపడతా... అమరావతి పూర్తి చేస్తా, పోలవరం పూర్తి చేస్తా అంటూ, చంద్రబ్బు చెప్పారు...
అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, ముంబైలాంటి నగరాలతో పోల్చడం లేదని.. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోల్చుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణంలో పొరపాటున ఓడితే పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు అంటున్నారని చంద్రబాబు వెల్లడించారు. అయితే ఓడిపోయే పరిస్థితే లేదని తాను ధైర్యంగా చెబుతున్నానని అన్నారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామని అన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించారని వార్తలు వచ్చాయని, మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగిస్తే ఏపీకీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
దేశంలో ఏ నాయకుడూ ఎదుర్కోనన్ని సంక్షోభాల్ని తాను ఎదుర్కొన్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్‌గా తయారు చేశానని చెప్పారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల గురించి ఎన్నోపోరాటాలు చేశానని పేర్కొన్నారు. అందుకే రాష్ట్రం విడిపోయాక కూడా రెండు ప్రాంతాల్లో తనను గౌరవించారని అన్నారు.