టాలెంట్ ను ప్రోత్సహించటంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. గతంలో క్రీడాకారులును ఎంకరేజ్ చెయ్యటం మనం చూసాం, అలాగే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న వారిని స్వయంగా ఫోన్లు చేసి మరి అభినందించే వారు. అలాగే వివిధ ప్రతిభ చూపించిన అనేక మందికి, స్వయంగా కలుస్తూ, వారిని అభినందిస్తూ ప్రోత్సహించే వారు. ఇప్పుడు ఇదే కోవలో, తెలుగులో పాపులర్ గాయనిగా పేరు ఉన్న, విజయవాడ వాస్తవ్యులు గాయని స్మితకు చంద్రబాబు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఇదే విషయాన్ని స్మిత స్వయానా ఆమె తన ట్విట్టర్ లో ఎకౌంటులో పెట్టారు. స్మిత గాయనిగా కెరీర్ ప్రారంభించి 20 ఏళ్ళు అయ్యింది. మన తెలుగు అమ్మాయి, పాప్ సాంగ్స్ పాడటం చాలా అరుదు. అలాంటిది, స్మిత ఏకంగా 20 ఏళ్ళు అదే ఫీల్డ్ లో ఉన్నారు. ఈ నేపధ్యంలో, 20 ఏళ్ళు పూర్తీ చేసుకున్న సందర్భంగా, ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

smita 21072019 2

ఇదే కోవలో చంద్రబాబు కూడా ఆమెను అభినందించారు. దీనికి సంబంధించి ఒక లేఖను స్మితకు చంద్రబాబు పంపారు. ‘నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు ఆహ్లాదం కల్గిస్తున్నందుకు అభినందనలు. శ్రోతలను అలరించడానికి వివిధ రూపాల్లో పాటలను వేదికగా చేసుకుని స్మిత సాగిస్తున్న ప్రయాణం అనిర్వచనీయం. కాలానికి అనుగుణంగా పాటల పందిరి నిర్మాణం మరింత జనరంజకం అవుతుందని విశ్వసిస్తున్నాను. ఒక్క తెలుగులోనే కాకుండా సంగీతానికి ఎల్లలు లేవరని తెలుపుతూ 9 భాషల్లో పాటలు పాడిన ఘనత సాధించడం ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ స్మిత తన మధుర కంఠంతో ఇలానే అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను’ అంటూ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.

smita 21072019 3

గాయనిగా స్మిత, తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిన్నటితో ఇరవై సంవత్సరాలు పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో స్మిత ఒకే ఒక్క ‘ఇండిపాప్‌’ కావడం విశేషం. 1996లో ఈటీవీలో వచ్చే పాడుతా తీయగా కోసం తొలిసారి మైక్‌ పట్టుకుని, ఇప్పటి వరకు అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్మిత తన కెరీర్ ను మలుచుకున్నారు. 1999లో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్మిత, నిన్నతో తన కెరీర్ లో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇదీ ఇలా ఉంటె, తన కెరీర్ 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా, హైదరాబాద్‌లో ఈ నెల 22న ‘ఎ జర్నీ 1999–2019’ పేరుతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన లేఖ చూసిన స్మిత, అది ట్విట్టర్ లో పెడుతూ, ఇది నిజంగా నాకు సర్‌ప్రైజ్‌... ధన్యవాదాలు చంద్రబాబు గారు అని పెట్టి, లెటర్ కూడా పోస్ట్ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read