విశాఖ‌ప‌ట్నంలో అగ్రిటెక్ స‌ద‌స్సు ముగింపు స‌మావేశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడితో క‌లిసి మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు, మంత్రులు నారా లోకేశ్, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ... ప్రపంచంలో ప్రతి ఐదుగురు టెకీల్లో నలుగురు తెలుగువారని సీఎం చంద్రబాబు కొనియాడారు. సాప్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌తో తొలి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు.

cbn gates 17112017 2

20 ఏళ్ల క్రితం అమెరికాలో కాక్‌టైల్ పార్టీలో కలవమన్నారని, రాజకీయంగా ఇబ్బంది ఉంటుందని చెబితే విడిగా సమావేశమయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్‌గేట్స్‌ 10 నిమిషాల సమయం ఇచ్చి..40 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటైందని, డబ్బు అందరూ సంపాదిస్తారు..బిల్‌గేట్స్‌లా కొద్ది మందే సద్వినియోగం చేస్తారని కొనియాడారు. సంపాదించిన సొమ్ములో ఎక్కువభాగం సమాజం కోసమే ఖర్చుచేస్తున్నారని, వ్యవసాయ సదస్సుకు బిల్‌గేట్స్‌ రావడం అరుదైన విషయమని చంద్రబాబు పేర్కొన్నారు.

cbn gates 17112017 3

అయితే చంద్రబాబు, బిల్ గేట్స్ ని మూడు విషయల్లో ఆంధ్రప్రదేశ్ కు సహాయం చెయ్యమని అడగారు.. నాకు మీ నుంచి డబ్బు సహాయం వద్దు, మూడు విషయాల్లో సహాయం చెయ్యండి అంటూ... వ్యవసాయం, న్యూట్రిషన్, హెల్త్ విషయంలో మీ సేవలు, మీ ఫౌండేషన్ సేవలు మా రాష్ట్రానికి కావాలని అడిగారు... ఇప్పటికే మీరు హెల్త్ సెక్టార్ ల వినుత్నమైన రీసెర్చ్ చేసారని, మీ సలహాలు, సూచనలు, మీ టెక్నాలజీ, అన్నీ మాకు కావాలని, ఆ విషయంలో మాకు సహకరించండి అంటూ, చంద్రబాబు బిల్ గేట్స్ ని కోరారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read