అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించాలని డీజీపీని చంద్రబాబు ఆదేశించారు. వదంతులు వ్యాపింపచేసి ప్రజల్లో భయం పెంచేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు... గత వారం రోజులుగా, రాష్ట్రంలో జరుగుతున్న విష ప్రచారం పై చంద్రబాబు ఈ సమీక్ష చేసారు. ఇప్పటికే రాష్ట్ర హోం శాఖ కూడా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది... ఇప్పుడు పరిస్థితి తీవ్రతని దృష్టిలో పెట్టుకుంది, స్వయంగా ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగారు..
"పార్ధీ గ్యాంగ్ సంచరిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. అమ్మాయలు, చిన్న పిల్లలను అపహరిస్తున్నారు అని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అవి ప్రజలు నమ్మకండి. ఆ తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను భయపెడుతున్న వారి పై, విచారణ చేసి, సరైన ఆక్షన్ తీసుకుంటాం.." అంటూ హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. దొంగలు ఇళ్లల్లో చొరబడి సొత్తు దోచుకోవడంతో పాటు మనషులపై దాడులు చేస్తున్నారని, చిన్న పిల్లలను అపహరించి హత్యలు చేస్తున్నారన్న వదంతులు వాట్సాప్ గ్రూపుల్లో వ్యాప్తి చెందటంతో గత కొన్ని రోజులుగా ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు..
ఇవన్నీ ఒక పధకం ప్రకారం, రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థుతులు నెలకొల్పటానికి, ఎవరో చేస్తున్నారు అనే నిర్ధారణకు పోలీసులు వచ్చారు.. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు... ప్రజలని ఇలా భయపెడుతూ, ఎదో జరిగిపోతుంది అనే ప్రచారం కలిగింది, ప్రజల్లో భయం కలిగించేలా చేస్తున్న వారిని గుర్తించి, చంద్రబాబు కూడా వారి పై చర్యలు తీసుకోమని చంద్రబాబు డీజీపీని కోరారు.. పోలీసులు ఇప్పటికే రంగలోకి దిగారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. ఎలాంటి నరహంతక గ్యాంగ్‌లు రాలేదని, జనం ఆందోళన చెందవద్దని మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజల్లో అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవి రాష్ట్రమంతా పాకటంతో, ఏకంగా రాష్ట్ర హోం శాఖ కూడా, ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పూర్తి సమాచారం కోసం వాట్సప్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు నోటిసులు పంపించామని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎవరిపైనా అనుమానాలు ఉంటే పోలీసులకు ఫోన్ చెయ్యాలని చెప్పారు.