కరోనాపై సీఎం చేసిన జగన్ వ్యాఖ్యలను తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ముఖ్యమంత్రికి ఎన్నికల మీద ఉన్న ధ్యాస ప్రజారోగ్యంపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పై ప్రజలను అప్రమత్తం చేసారు. చంద్రబాబు మాట్లాడుతూ ‘‘కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఏ ఇద్దరి నోట అయినా కరోనా వైరస్ గురించే మాట్లాడే పరిస్థితి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్యానిక్ రియాక్షన్ ఉంది. ఇది ఒక గ్లోబల్ వైరస్ గా తయారైంది. ఎంత వేగంగా విస్తరిస్తోందంటే, గడిచిన 24గంటల్లో 9దేశాలకు పాకింది. 7ఆఫ్రికా దేశాలు, 1యూరప్, 1 దక్షిణ అమెరికా దేశాలకు ఒకరోజులో విస్తరించింది. ప్రపంచాన్నే కరోనా గజగజలాడిస్తోంది. అనేక దేశాల్లో విమానాశ్రయాలు మూసేశారు. సరిహద్దులు మూసేశారు.స్పెయిన్ ప్రధానమంత్రి భార్య గొమెజ్ కు వైరస్ సోకింది. బ్రిటిష్ రాజ దంపతులు రాణి ఎలిజబెత్(93), ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్(98)లను బకింగ్ హామ్ పాలెస్ నుంచి నార్ ఫోక్ లోని శండ్రిన్ హామ్ కు తరలించే పరిస్థితి. ఐరోపా నుంచి అమెరికాకు రాకుండా నిషేధాజ్ఞలు-న్యూజెర్సీలో కర్ఫ్యూ పెట్టారు. డెన్మార్క్,పోలెండ్,చెక్ రిపబ్లిక్,స్లొవేకియా,ఫిలిప్పీన్స్, రష్యా సరిహద్దుల మూసేశారు. ఇటలీలో 1,441మంది చనిపోయారు. స్పెయిన్ లో 136మంది, ఫ్రాన్స్ లో 91మంది, జర్మనీలో 8మంది,స్విట్జర్లాండ్ లో 11మంది,యూకెలో 21మంది, ఇరాన్ లో 608మంది, యూఎస్ లో 41మంది చనిపోయారు. రోజురోజుకూ డెత్ లు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ పై రియల్ టైమ్ లో డేటా అప్ డేట్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5గంటలకు 6,652 మంది వైరస్ వల్ల చనిపోయారు. నిన్నటికి ఈ రోజుకు 5కేసులు పెరిగాయి మనదేశంలో...మహారాష్ట్ర, కేరళ,ఢిల్లీ, రాజస్తాన్ లో పెరుగుతోంది.

ప్రపంచ దేశాల్లో స్క్రీనింగ్ చూస్తే, ప్రతి లక్షమంది జనాభాకు బెహరాన్ 6,155 బెహరాన్ చేస్తే, దక్షిణ కొరియా 4,831 చేస్తే, చైనా 2,820చేస్తే, ఐస్ ల్యాండ్ 2,505 చేస్తే, ఇండియాలో ముగ్గురిని చేస్తున్నారు. ఏపిలో జీరో చేస్తున్నారు. విదేశాలనుంచి ఏపికి వచ్చిన 6777మందిలో ఒక్కరిని కూడా పరీక్షించకుండా పేదల ఆరోగ్యంతో ఆడుకుంటూ ఈరోజు ఎన్నికలు ఎన్నికలు అంటున్నారు. ఈ రోజే దుబాయ్ నుంచి తూర్పుగోదావరి అంతర్వేదిపాలెం వచ్చి కాకినాడ చికిత్సలో ఉన్న మహిళ కరోనా లక్షణాలతో మృతి చెందిందని తెలుస్తోంది. తూగో జిల్లాలో 900మంది విదేశాలనుంచి వచ్చారని అలర్ట్ చేశారు. ఏ కలెక్టర్, ఏ అధికారి ఈవిధంగా పని చెయ్యకుండా ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి. ఇంత ప్రమాద ఘంటికలు మోగుతుంటే ఈ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఏంటి నీ పైశాచిక చర్య, పైశాచిక ఆనందం..? ఈ రోజు ముఖ్యమంత్రి కరోనా వదిలేసి రమాకాంత్ రెడ్డితో ఎన్నికల నిర్వహణ గురించి మాట్లాడుతున్నారు. రిగ్గింగ్ చేసి, బెదిరించి గెలిచానని చెప్పుకోవాలని చూస్తున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి, మొద్దునిద్ర వదిలిపెట్టాలి.

రాబోయే రెండుమూడు వారాలు క్రూషియల్. నువ్వుమాత్రం పైశాచిక ఆనందంతో ఇంకా ఎన్నికలు పెట్టాలని సుప్రీంకోర్టుకు వెళ్తారు. నీకు బాధ్యత లేదు, బాధ్యతతో వ్యవహరించిన ఈసిని విమర్శించే పరిస్తితి. ‘‘ఈ శతాబ్దపు మహమ్మారి కరోనా’’ వైరస్ అని బిల్ గేట్స్ చెప్పారు. తన ఫౌండేషన్ నుంచి 10కోట్ల డాలర్లు, రూ 740కోట్లు విరాళంగా ఇచ్చారు. ప్రజల ప్రాణాల మీద శ్రద్ద లేని ముఖ్యమంత్రి ఈయన మన జీవితాలతో ఆడుకుంటున్నాడు. ప్రభుత్వం మొద్దునిద్ర వదిలేయాలి. 5కోట్ల ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలి. రాబోయే 2నెలలు క్రూషియల్. మీరు మాత్రం అప్రమత్తంగా లేకపోతే ఇండియాలో కంట్రోల్ చేయడం కష్టమని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హెచ్చరించారు. మన రాష్ట్రంలో మాత్రం లెక్కలేని తనంతో వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్ మీద ఉండే ధ్యాసలో 10%కూడా కరోనా వైరస్ కంట్రోల్ పై రాకపోవడం దురదృష్టకరం. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మనందరి దురదృష్టం. వితండవాదం వద్దు. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకోవద్దు. మీ మీద ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రమాదం లేదని ఛీప్ సెక్రటరీ లేఖ రాస్తారు. వైద్యం ఆరోగ్యంపై మీకేం పరిజ్ఞానం ఉంది..? ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడిచేస్తే ఈ లేఖ రాస్తారా..? ఎందుకీ దౌర్భాగ్యపు పనులు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంటే మీకు పట్టదా..? ఈ ముఖ్యమంత్రి ఏది చెబితే అది చేయవద్దండి. పదవి కోసం కక్కుర్తిపడి ఇలాంటివి చేయకండి. గతంలో డెంగూ వస్తే నన్ను ఎగతాళి చేసేవారు.దోమలపై దండయాత్ర అని హేళన చేశారు. ఈరోజు కూడా కరోనా వైరస్ పై అపహాస్యం చేస్తున్నారు.

ప్రభుత్వం ఉధాసీనంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అనుమానంగా ఉంటే వాయిదా వేసుకోండి. ప్రయాణాలు తగ్గించుకోవాలి. టచ్ పాయింట్స్ తగ్గించుకోవాలి. పదిమంది కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం అందరం జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దీనిని ఎదుర్కోలేం. మన ప్రాణాలకు ముప్పు ఒకటి, మనవల్ల సమాజానికి ముప్పు ఇంకోటి. పశ్చిమ బెంగాల్ లో స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. వైరస్ ను 100% నియంత్రించ గలిగినప్పుడే మనం ఊపిరి పీల్చుకుంటాం. లేకపోతే చాలా పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుంది. టిడిపి తరఫున 20మార్గదర్శకాలు అందరికీ పంపాం. న్యూస్ పేపర్లు, డోర్ హ్యాండిల్స్, పాల ప్యాకెట్లు, కరెన్సీ నోట్లు, నాణేలు, వాహనాల ప్రయాణంలో, డోర్ బెల్స్ టచింగ్ ద్వారా ఇది విస్తరిస్తుంది. ప్రపంచీకరణ వల్ల దేశ విదేశాల మధ్య రాకపోకలు పెరిగాయి. టచ్ పాయింట్ పెరిగింది, విస్తరించే అవకాశాలు పెరిగాయి. కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. ప్రపంచ దేశాలన్నీ ఒక మహమ్మారి గురించి తీవ్రంగా ఆలోచించడం ఇదే తొలిసారి.

ఒక ప్రాంతంలో ఈ వైరస్ ఆగితే చాలదు. ఇతర ప్రాంతాలనుంచి మళ్లీ రావచ్చు. కూకటివేళ్లతో దీనిని నిర్మూలించాలి. దీనిని సమూలంగా నిర్మూలించేదాకా ప్రమాదం అందరికీ పొంచివుంది. కర్ణాటక, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ప్రతిరోజూ అనేకమంది పోయి వస్తున్నారు. రాదని ఎలా చెబుతున్నారు. ఇంకా ఎదురుదాడి ఎలా చేస్తున్నారు మూర్ఖులు మాదిరిగా.. పద్దతిలేని రాజకీయాలు చేస్తారా..? ప్రజారోగ్యంతో ఆడుకునే హక్కు మీకెక్కడ ఉంది..? ప్రజలకు మీరిచ్చే సలహాలు ఇవేనా..? ఉన్మాదం పరాకాష్టకు వెళ్తే ఇలాగే ఉంటుంది. వీళ్లకు ప్రజారోగ్యం అవసరం లేదు. ఓటేయడానికి ఒకే స్టాంప్ ఓటర్లు పట్టుకోవాలి. ఒకే పెన్సిల్, పెన్నుతో సంతకాలు చేయాలి. చెయ్యి పట్టుకుని వేలిపై ఇంక్ మార్కింగ్ పెట్టాలి. ముందు వాడినవాళ్ళకు వైరస్ ఉంటే తర్వాత వాళ్లకు రావాల్నా..? వీళ్లకోసం ప్రజల ఆరోగ్యం తాకట్టు పెట్టాలా..? మనుషులు ఉంటే ఎలక్షన్..మనుషులు లేకుంటే ఎందుకింక ఎలక్షన్..? ఇన్నిరోజులు ఏం నిద్ర పోయారా..?కావాలని చెప్పి ఇష్టారాజ్యంగా చేస్తారా..? సుప్రీంకోర్టుకంటే మీరు తెలివైన వాళ్లా..? కేంద్రం కంటే మీరు తెలివైన వాళ్లా..? ఎవరెట్టా పోయినా ఏదోరకంగా ఎలక్షన్ పెట్టాలా..? అంటే ఓటేయాల్సిన పనిలేదనా..? మీరే ఓట్లు గుద్దుకోవాల్నా..?

Advertisements

Advertisements

Latest Articles

Most Read