ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుతం ఎంత శక్తివంతమైన మనిషి అనేది అందరికీ తెలుసు... అందుకే ఇప్పటి వరకు దేశంలో ఎవరు, ఆయనతో గట్టిగా డీ కొట్టే ప్రయత్నం చెయ్యలేకపోయారు... సోనియా, మమతా లాంటి వారు, మోడీ పై విమర్శలు చేస్తున్నా, ఆయనతో డీ కొట్టే సాహసం చెయ్యలేక పోయారు... ఇక మన రాష్ట్రంలో అయితే, కొంత మందికి మోడీ అనే పేరు పలకాలి అన్నా, భయం... అందుకే కేంద్రం అన్యాయం చేస్తున్నా, చంద్రబాబు పైనే విమర్శలు చేస్తూ, పబ్బం గడుపుకుంటున్నారు... ఈ నేపధ్యంలో చంద్రబాబు గత కొన్ని రోజులగా కేంద్రం పై విరుచుకు పడుతున్నారు...
అయితే, ఇప్పటి వరకు, కేంద్రం చేస్తున్న అన్యాయం, వారు ఏమి ఇచ్చింది, మనం ఏమి ఖర్చు పెడుతుంది... ఇలా ఈ లైన్ లోనే, విమర్శలు చేస్తూ వచ్చారు.. అయితే, మొదటి సారిగా, ఒక బహిరంగ వేడుకలో, మోడీ మనల్ని మోసం చేసారు, మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం రండి అని ప్రజలకు పిలుపు ఇవ్వటం, సంచలనమే... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని పై, ఇలా విమర్శలు చెయ్యటం మాములు విషయం కాదు... విభజన హామీల సాధన ధర్మపోరాటానికి రాష్ట్రప్రజలంతా చేయీ చేయీ కలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విభజన హామీలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని మోదీ మోసం చేశారని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.
మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు అండగా ఉంటే కొండనైనా ఢీకొంటానని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం స్థానికులనుద్దేశించి కొద్దిసేపు ప్రసంగించారు. న్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు మంజూరు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోందన్నారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం ప్రాజెక్టుగా అభివర్ణించిన సీఎం వాటిని పూర్తి చేసి తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి అన్యాయం చేయాలని చూస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని బీజేపీని హెచ్చరించారు