వైకాపా హోదా తప్ప వేరే అంశం మాట్లాడటం లేదు..హోదా సెంటిమెంట్ తో రాజకీయలాభం పొందాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు... విభజన చట్టం లోని 18 అంశాలను, మన్మోహన్ సింగ్ ఇచ్చిన 6హామీలలో 5 వదిలేసి హోదాను మాత్రమే సెంటిమెంట్ గా పెంచి లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తోంది. ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైకాపా రోజుకో మాట మాట్లాడుతోంది. ఒకరోజు ఎంపీల రాజీనామాలు అంది. రాజీనామా చేస్తే సీట్లు ఖాళీ అవుతాయి, ఏడాదికూడా సమయం లేదుకాబట్టి ఉప ఎన్నికలు రావనే విమర్శ రావడంతో ప్లేటు మార్చింది.
ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం అంటోంది. అవిశ్వాసం అనేది ఆఖరి అస్రంవి.కడపటి ఆయుధం.దానికీ మనం సిద్ధం అనడంతో మళ్లీ వెనక్కితగ్గుతోంది.మీరే పెట్టండని తప్పుకోవాలని చూస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుంది అని తొలుత పొగిడింది..కృష్ణార్జునుల ఫొటోలు వేసి బడ్జెట్ ను భగవద్గీతగా పోల్చింది.టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో నిలదీయగానే వచ్చిన ప్రజల మద్దతు చేసి ప్లేటు ఫిరాయించింది.తమ ఎంపిలతో కూడా ఆందోళన చేపట్టింది.రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి రాజ్యసభలో ప్రస్తావించిన కేంద్రమంత్రి వై.ఎస్.చౌదరిపై చర్యలు తీసుకోవాలని రూల్ బుక్ చూపి స్పీకర్ ను కోరడం, రాష్ట్రపతికి,ప్రధానికి ఫిర్యాదులు చేసినప్పుడే వైకాపా చిత్తశుద్ది ఏమిటో బైటపడింది.
రాజ్యసభలో సీఎం రమేష్ ను మార్షల్స్ లాక్కుపోతుంటే కూర్చుని చిద్విలాసంగా నవ్వుకున్నప్పుడే ఆ పార్టీ నైజం తెలిసిపోయింది. రాజకీయ లాభాలు తప్ప రాష్ట్ర ప్రయోజనం వారికి పట్టదనేది రుజువైంది. పునర్విభజన చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది అఖిల సంఘాల సమావేశం. అఖిల పక్ష సమావేశం కాదు. అసెంబ్లీలో టిడిపితో పాటుగా ఒక పార్టీయే వుంది. ఇంకో పార్టీ అసెంబ్లీకి రావడం లేదు. మిగిలిన పార్టీలకు ప్రాతినిధ్యం లేదు. అందుకే అఖిల సంఘాలతో సంప్రదింపులు చేస్తాం.దీనికి పార్టీలతోపాటుగా ప్రజా సంఘాలు కూడా హాజరుకావచ్చు. దీనిద్వారా విస్తృత ప్రజాభిప్రాయం తెలుసుకునే వీలుంటుంది.అసలైన జనాభిప్రాయం బైటపడుతుంది.