బంద్‌లు, రాస్తారోకోలు చేస్తే రాష్ట్రానికే నష్టం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని, ప్రధాని మోదీ చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలన్నారు. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు నష్టపోతారన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఈ నెల 16 న ఏపీ బంద్‌కు వామపక్ష పార్టీలు, వైసిపీ పిలుపునిచ్చిన నేపధ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు... దేశం మొత్తం తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. మనమంతా కలిసి ప్రధాని మోదీపై పోరాటం చేయాలని, ఢిల్లీ వెళ్లి మోదీపై పోరాటం చేయాలి కానీ... రాష్ట్రంలో రాస్తారోకోలు చేస్తే ఏం వస్తుందంటూ చంద్రబాబు అన్నారు. బంద్‌లు రాస్తారోకోల వల్ల రాష్ట్రానికే నష్టం అని, మన పోరాటాలు ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలని సీఎం అన్నారు.

cbn 12042018 1 1

అప్పట్లో స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామ రాజు వంటి వారు తమ తమ శైలిలో పోరాడారని, కొంత మంది మనవాళ్లు మాత్రం బ్రిటీష్ వారితో లాలూచీ పడ్డారని, వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు తాను చేసే పోరాటం రాష్ట్రం కోసమేనని, తాను కేంద్ర ప్రభుత్వం, మోదీపై పోరాటం చేస్తున్నానని అన్నారు. వైసీపీ, జనసేన ఈ పోరాటానికి కలిసి రాకుండా కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. పోరాటంలో చిత్తశుద్ధి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం మున్ముందు ఏ రూట్లో వస్తుందో మనం ఏ రూట్లో పోవాలో చూడాలని వ్యాఖ్యానించారు. అసలు బ్రిటీష్ వారికి, కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.

cbn 12042018 1 1

‘ప్రధానిగా ఉన్న వ్యక్తి దీక్ష చేయడం దేశ చరిత్రలో లేదు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయ కారణాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరికొన్ని రాష్ట్రాలను ఇప్పుడు రెచ్చగొడుతున్నారు.. దీని వల్ల వారే నష్టపోతారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతే కేంద్రంలో మోదీ ఆనందపడతారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు మోదీ ఆనందపడేలా ప్రవర్తిస్తున్నాయి.’ అని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేశారని ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అన్నీ సాధించే వరకు రాజీపడేది లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read