నిన్న జగన్ చెప్పిన అబద్ధాల పై, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా సభకు వచ్చింది. స్పీకర్ ను రిక్వస్ట్ చేసి, నిన్న జరిగిన చర్చ ఈ రోజు కూడా కొనసాగించాలని కోరారు. జగన్ కూడా ఒకే అనటంతో, చర్చ మొదలైంది. ఈ సందర్భంగా, చంద్రబాబు అన్ని రికార్డులతో సభ ముందుకు వచ్చి, నిన్న జగన్ చెప్పిన అబద్ధాలుకు కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి రూపాయి కూడా ఇవ్వలేదని, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ తనను రాజీనామా చేయాలని సవాల్ చేసరాని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఇన్ని ఆధారాలు చూపిస్తుంటే, సిగ్గు లేకుండా నవ్వుతున్నారన్నారు. 2013లో సున్నా వడ్డీ పధకం అమల్లోకి వచ్చిందని అన్నారు. తరువాత మా ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకూ కొనసాగించిందని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ బకాయిలు 43.70 లక్షల మంది రైతుల రుణాలకు రూ.979.45 కోట్ల వడ్డీని తెలుగుదేశం ప్రభుత్వం చెల్లించిందన్నారు.
అలాగే తెలుగుదేశం హయంలో రుణాలు రీషెడ్యూల్ చేయలేదని అంటున్నారని అన్నారు. ఈయనకు అసలు రూల్స్ కూడా తెలియవని అన్నారు. కరువు మండలాలను ప్రకటించాక రుణాలు ఆటోమాటిక్ గా రీషెడ్యూల్ అవుతాయనే విషయాన్ని తెలుసుకోవాలని చంద్రబాబు అన్నారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్ చేశామని, డాక్యుమెంట్లు స్పీకర్ కు ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, జగన్ అసలు రూపాయి కూడా ఇవ్వలేదని, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ సీఎం ఎందుకు అంత పరుషంగా మాట్లాడారని చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను రాజీనామా చేసి వెళ్లిపోతారా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చర్చలో గాడిదలు కాశారా అని అన్నారు. సున్నా వడ్డీ పథకం పై అన్ని వివరాలు సభ ముందు ఉంచాం, మరి ఇప్పుడు జగన్ రాజీనామా చేస్తారా ? లేకపోతె 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.