మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు పరామర్శించారు. అమరావతి నుంచి విమానంలో విశాఖ చేరుకున్న చంద్రబాబు.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పాడేరు చేరుకున్నారు. కిడారి నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. సర్వేశ్వరరావు కుమారులను అక్కున చేర్చుకున్న చంద్రబాబు.. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు కుమారులు సందీప్, శ్రవణ్ లను ఒదార్చిన చంద్రబాబు, మాకు ఈ చిన్న వయసులోనే అండ పోయింది సార్ అని చెప్పిన మాటలకు, మీకు నేనున్నా అంటూ, భావోద్వేగంతో వారిని దగ్గరకి తీసుకుని ఓదార్చారు.

kidari 28092018 2

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘గిరిజనులకు ఎనలేని సేవలందించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడం బాధాకరం. ఆయన చనిపోయారన్న విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నా. కిడారి ఆశయాల సాధనకు తెదేపా కృషి చేస్తుంది. గిరిజనుల్లో ఇంతటి బలమైన రాజకీయ నేత ఉండటం చాలా అరుదు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.కోటి సాయం అందిస్తాం. కుటుంబసభ్యుల్లో నలుగురికి రూ.5లక్షల చొప్పున పార్టీ తరపున ఇస్తాం. చిన్న కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం కల్పిస్తాం."

kidari 28092018 3

"మొదటి కుమారుడికి ఏం చేయాలన్న దానిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలా? వద్దా? అన్నది పార్టీ నిర్ణయిస్తుంది. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. కాబట్టి విశాఖ నగరంలో వారికి స్థలం కేటాయిస్తాం. ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాం. బాక్సైట్‌ గనులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా ఈ ఘటన జరగడం బాధాకరం. వైఎస్‌ హయాంలో కేటాయించిన గనులను మా ప్రభుత్వం రద్దు చేయించింది. ఈ విషయం తెలియని కొందరు అనసవర విమర్శలు చేస్తున్నారు.’ అని అన్నారు. కిడారి కుటుంబాన్ని ఓదార్చిన చంద్రబాబు అనంతరం అరకులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సివేరి సోమ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read