ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది... అన్ని పార్టీల నేతలని కలుస్తున్న చంద్రబాబు, బీజేపీ పార్టీ విభజన హామీల్లో మోసమే కాకుండా, ఎంత దుర్మార్గంగా అవినీతి పరులతో చేతులు కలిపింది వివరిస్తున్నారు... అవినీతి పై పోరాటం అంటూ, ప్రతి రోజు అవినీతి పరులని కలుస్తున్నారని, దానికి ప్రధాని ఆఫీస్ అడ్డగా మారింది అంటూ, విజయసాయి రెడ్డి, జగన్ గురించి చెప్తున్నారు... 16 నెలలు జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తులు, 11 సిబిఐ, 5 ఈడీ కేసుల్లో ఉన్నవారిని, ప్రధాని ఎలా కలుస్తున్నారు అంటూ, అందరికీ వివరిస్తున్నారు...
అలాగే, నేషనల్ మీడియాతో కూడా మాట్లాడారు... తన పర్యటన పూర్తిగా విభజన హామీల అంశంపైనే తప్ప రాజకీయ ఉద్దేశాలేమీ లేవని అన్నారు. జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడేందుకు విముఖత వ్యక్తంచేశారు... ప్రధాని కార్యాలయాన్ని వైకాపా ఇష్టంవచ్చినట్లు వాడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19 పెండింగ్ అంశాలను సమావేశంలో వివరించారు. రాష్ట్ర విభజన తదనంతరం పరిణామాలు, కేంద్రం వైఖరి, ఎన్డీయే నుంచి బయటకు రావడంపై కారణాలను వెల్లడించారు. పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న విధానాన్ని వివరించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రస్తావించారు.
తొలిరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు తొలుత మహాత్ముడి విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం పార్లమెంట్ మెట్లను తాకి నమస్కరించి సెంట్రల్ హాల్‌లోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు, ఎంపీలను కలిశారు. ఆ తర్వాత తెదేపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తెదేపా ఎంపీలతో భేటీ అయ్యారు. వివిధ పార్టీల నేతలతో చర్చించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.