యుఏఈ ఎక్స్ఛేంజ్... 40 బిలియన్ యుఎస్ డాలర్ల టర్నోవర్తో 45 దేశాలలో మనీ ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ.... అలాంటి ప్రతిష్టాత్మికమెయిన్ యుఏఈ ఎక్స్ఛేంజ్ 37 వ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గునే అరుదైన అవకాశం దాక్కింది... అంతే కాదు యుఏఈ ఎక్స్ఛేంజ్లో ‘డీజీ ల్యాబ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ’ ముఖ్యమంత్రి ప్రారంభించారు.. యుఏఈ ఎక్స్ఛేంజ్ చైర్మన్ డాక్టర్ బీఆర్ షెట్టీ ఆహ్వానం మేరకు వార్షికోత్సవంలో పాల్గొని ‘డీజీ ల్యాబ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ’ ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. డాక్టర్ బీఆర్ షెట్టీ మాట్లాడుతూ, డీజీ ల్యాబ్ ను, విజనరీ లీడర్, టెక్ గురూగా పేరుపొందిన చంద్రబాబు ప్రారంభించటం మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "సాంకేతికత మన జీవితాలను, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. సాంకేతికత వల్ల మన జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఈ మార్పు చాలా వేగంగా సంభవిస్తోంది. 37 సంవత్సరాలలో ఎంతో పెద్ద వ్యవస్థగా మారిన యుఏఈ ఎక్స్ఛేంజ్ ని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు ప్రవేశపెట్టిన సాంకేతికతను చూశాక మీతో పోటీ పడాలని మరింత ఆసక్తి పెరిగింది. మా దగ్గర కూడా ఇటువంటి కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెట్టాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. ఇరవై సంవత్సరాల క్రితమే నేను సాంకేతికత వల్ల సాధించగలిగే అభివృద్ధిని ఊహించాను. సాంకేతికత అందించే ఊతంతో సామాన్యుల జీవితాల్ని మరింత మెరుగుపర్చవచ్చు. అందుకే ప్రభుత్వ పాలనలో అడుగడుగునా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాం."
"డ్రోన్లు, వర్చువల్ క్లాస్రూములు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, సెన్సర్లు, వర్చువల్ రియాలిటీ వగైరా నవీన సాంకేతిక పద్దతులు, పరికరాలను విరివిగా వాడుతున్నాం. మనుషులు చేసే పని చాలా వరకు నేడు యంత్రాల ద్వారా జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగాలు పోతాయనే భయం వాస్తవం కాదు. ఉద్యోగాలు పోవు, ఉద్యోగాల స్వభావం మారుతుంది. సాంకేతికతను చూసి భయపడకూడదు. దాన్ని మన అవసరాల కోసం ఉపయోగించుకోవాలి. నేను ఎక్కడికి వెళ్లినా నా తోటివారికి ఒకటే చెబుతాను-‘మీరు పనిచేసే మట్టిని గౌరవించండి. అలాగే, మీ మాతృభూమిని మర్చిపోకండి’ అని. కర్మభూమిని గౌరవించండి, మీ జన్మభూమిని మర్చిపోకండి అంటూ చంద్రబాబు యుఏఈ ఎక్స్ఛేంజ్ లో ప్రసంగించారు.