మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, మూడో రోజు, ఆయన బుధవారం, కడప సబ్ జైలుకు వెళ్లారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తెలుగుదేశం కార్యకర్త, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించారు. కడప సబ్ జైలులో సామాన్య కార్యకర్త కోసం చంద్రబాబు వెళ్ళటంతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు బయట గుమి కూడారు. రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు అక్కడే, మీడియాతో మాట్లాడారు. చిన్న కేసుకే వెంకట సుబ్బారెడ్డిని జైలులో పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం శ్రేణుల పై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మానసికంగా వేధించి, పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. కొంత మంది పోలీసులు కూడా, ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, చట్టాన్ని అతిక్రమించి, అతిగా స్పందిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమించిన ప్రతి ఒక్కరి పై, ప్రైవేటు కేసు పెడుతున్నామని, ఎవరినీ వదిలి పెట్టే సమస్యే లేదని, అందరికీ వడ్డీతో సహా తిరిగి ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

cbn 27112019 2

ఇదీ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పై ఉన్న కేసు. కడప జిల్లలోని, ఖాజీపేట మండలం దుప్పలగట్టులో రెడ్యం వెంకట కొండమ్మ, రెడ్యం లక్ష్మీకుమారీలు పక్కపక్కనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత సెప్టెంబరు 29వ తేదీన ఒక చిన్న వివాదం ప్రారంభం అయ్యింది. ఇంటి ముందు నిలిచిన మురికి నీరు విషయంలో, ఇరువురికీ వాగ్వాదం జరిగింది. దీంతో ఈ సంఘటన టీడీపీ నేత రెడ్యం ఆదినారాయణరెడ్డి, వైసీపీ నేత శివశంకర్‌రెడ్డి వర్గీయుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ నేపదంలో ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేసారు.

cbn 27112019 3

రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, రెడ్యం ఆదినారాయణరెడ్డిలతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి, మైదుకూరు కోర్టుకు హాజరుపెట్టాగా, కోర్టు రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు వారిని కమలాపురం జైలుకు తరలించారు. కాగా ఇంటి వద్ద ఆడవాళ్ల మధ్య చిన్న వివాదాన్ని, రాజకీయం చేసి, తమ కుటుంబాలను అగౌరవం పరచాలని వైసీపీ నాయకులతో అక్రమ కేసులు పెట్టారని రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. దీని వెనుక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపధ్యంలో, నెల రోజులకు పైగా, జైలులో ఉన్న రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని, చంద్రబాబు జైలుకు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read