9 రోజులు విదేశీ పర్యటన... 3 దేశాల పర్యటన... సుమారు 100కు పైగా మీటింగ్‌లు... తెల్లవారు జామున 5 గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు.... కాని, ఈయన డిక్షనరీలో రెస్ట్ అనే మాట ఉండదు... బ్యాక్ టు వర్క్... సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్ లు... అన్నీ మామూలే...
గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల అభినందనలు తెలిపారు. ఈ అవార్డు తాను అందుకోవటం అందరి సమష్టి కృషి ఫలితమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 9 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సచివాలయానికి హాజరై వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సచివాలయంలో స్వచ్చాంధ్ర కార్యక్రమం పై 13 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఐఏఎస్, ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ, "సార్... వి ఆర్ షాకడ్ సీయింగ్ యువర్ ఫిట్నెస్... యు ఆర్ ఏ మషీన్ సార్" అంటూ వ్యాఖ్యానించారు...
తరువాత తన విదేశీ పర్యటన వివరాలు విలేకరులతో చిట్ చాట్ లో మాట్లాడుతూ... దర్శకుడు రాజమౌళి విలువైన సూచనలు చేసి... డిజైన్ల ఖరారులో కీలకంగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. అసెంబ్లీ మినహా రాజధాని భవనాల డిజైన్లు ఖరారు అయినట్టేనని తెలిపారు. సంక్రాంతికి అటూ ఇటూగా శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, మరో 40 రోజుల్లో అసెంబ్లీ డిజైన్లూ ఖరారు చేస్తామని చెప్పారు.పోలవరం నిర్మాణానికి నిధులతో ఇబ్బంది ఉందని, త్వరలోనే అడ్డంకులు తొలగిపోతాయని సీఎం ధీమా వ్యక్తం చేశారు. విదేశీ పర్యటన విజయవంతం అయిందని, తెలంగాణ టీడీపీలో వ్యవహారాలన్నీ సర్దుకుంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.