తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు కడపలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఈ రోజు రెండో రోజు కడపలో పర్యటిస్తూ, నియోజకవర్గాల వారీగా సమీక్ష నిరవహిస్తున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనైయ్యారు. ఒక కార్యకర్త పరిస్థితి తెలుసుకుని, చంద్రబాబు కారులోనే అలా ఓక రెండు నిమిషాలు ఉండి పోయారు. తరువాత సమీక్షా సమావేశంలో, కూడా చంద్రబాబు ఆ కార్యకర్తకు ఆర్ధిక సాహయం చేస్తూ, భావోద్వేగానికి లోనైయ్యారు. చంద్రబాబుని అలా చూసిన, కార్యకర్తలు, నేతలు కూడా, ఒక్క నిమిషం పాటు, అలాగే ఉండి పోయారు. వివరాల్లోకి వెళ్తే, పులివెందుల నివాసి అయిన, సూర్యనారాయణరెడ్డి బాధ విని చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా, చంద్రబాబు అతనికి ఆర్ధిక సహాయం చేసారు. తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా, ఆదుకుంటుంది అని భరోసా ఇచ్చారు.

cbn 26112019 2

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. జగన్‌ మోహన్ రెడ్డి ఒక ఉన్మాది, రాక్షసుడు అని, చంద్రబాబు ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలను వేధిస్తూ రాక్షసానందం పొందుతున్నాడని ఆయన ఆరోపించారు. జగన్‌ అనుచరులంతా ఉన్మాదుల్లా మారి తెలుగుదేశం కార్యకర్తలను వేధిస్తూ పైశాచికానందం పొందుతున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని చంద్రబాబు అన్నారు. మీడియా, పత్రికల గొంతు నొక్కి, నిజాలను బయటకు రాకుండా చూస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లోనే, 640 మంది తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు చేసారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేసి, ప్రజలను కూడా భయపెడుతున్నారని అన్నారు.

cbn 26112019 3

కొంత మంది పోలీసులు కూడా, చట్ట ఉల్లంఘన చేసి, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని అన్నారు. అధికార యంత్రాంగం దుర్వినియోగం చెయ్యటం, పరాకాష్టకు వెళ్లిందని చంద్రబాబు అన్నారు. వారు అనుకున్న వారికే, పెన్షన్లు, పధకాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఉపాధి హామీ పధకం డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదని అన్నారు. వ్యాపారుల దగ్గర జే టాక్స్ తీసుకుంటున్నారని అన్నారు. చివరకు మీడియా పై కూడా ఆంక్షలు పెట్టారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ గుండాలు చేసే పనికి, వడ్డీతో సహా, చెల్లించేలా చేస్తానని అన్నారు. ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పై, ప్రైవేటు కేసు పెడతామని చంద్రబాబు అన్నారు. బజారులోనే మీ మోఖాల పై ఊసేలా చేస్తానని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read