సీఎం చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు 69వ పుట్టిన రోజును టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దఎత్తున జరుపుతున్నారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ సహా పలువురు కీలక నేతలు బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఓ విజనరీగా, ధైర్యవంతుడైన వ్యక్తి అయిన మిమ్మల్ని తండ్రిగా పొందినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. మీరు ప్రపంచానికి ఓ విజనరీగా మాత్రమే కాదు.. ఓ భర్తగా, తండ్రిగా, తాతగా మాపై అమితమైన ప్రేమ కురిపించారు. దేవాన్ష్ తో నాలుగేళ్ల పిల్లాడిలా పరిగెత్తారు. రాబోయే రోజుల్లో మీరు ఇంతే ఉత్సాహంతో, శక్తిమంతంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

cbn 20042019

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. చంద్రబాబునాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. .. 'చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశం గర్వించేలా, యావత్ భరతజాతి ఏపీవైపు తిరిగిచూసేలా చంద్రబాబు విజన్ త్వరలో సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నటుడు శివాజీ అన్నారు. ఇక ముందు కూడా చంద్రబాబు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని భావిస్తున్నానన్నారు. ‘ధ్యాంక్యూ సీఎం సార్. హ్యావ్ ఏ హ్యాపీ బర్త్ డే’ అని చెప్పారు. ఈ మేరకు శివాజీ ఫేస్ బుక్ లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.

cbn 20042019

ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అలుపెరుగని శ్రామికుడు , అపర చాణక్యుడు ,అమరావతీ రాజధాని నిర్మాణ చతురుడు , గౌరవ్యులు శ్రీ నారా చంద్ర బాబుగారికి జన్మదిన శుభాకాంక్షలు ???శతమానం భవతు ??? @ncbn #Happy Birthday CBN’ అని ట్వీట్ చేశారు. కాగా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నేడు రోజంతా ఆయన బిజీగా గడపనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10: 30 గంటల వరకు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు, అభిమానులతో గడిపారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగే ఓ వివాహానికి హాజరయ్యారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్లడ్‌బ్యాంకును ప్రారంభిస్తారు. రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఇప్పటికే పలువురు నేతలు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read