చట్టసభలు రద్దైనా, రద్దును కేబినేట్ కోరితే గవర్నర్ ఆమోదించినప్పుడు లేదా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే (ఎన్నికలలో ఓడిన తరువాత, లేదా సాధారణంగా రాజీనామా చేసినా, బలపరీక్షలో విఫలం అయినప్పుడు కూడా) అప్పుడు కొత్తవారు వచ్చే వరకూ care taker, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆ పాతవారిని కొనసాగాలని కొన్ని పరిస్థితుల్లో గవర్నర్ కోరతారు. లేకపోతే సాంకేతికంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉంటుంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డిగారు తెలంగాణ బిల్లు ఆమోదం పొందినవెంటనే రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగనని కుండబద్దలు కొట్టి వెళ్లిపోయారు. 2004లో చంద్రబాబు గారు ఎంతో ముందుగానే, అలాగే 2018లో కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు సభ రద్దుచేసి వెళ్లి నెలల తరబడి ఆపద్ధర్మ ముఖ్యమంత్రులుగా కొనసాగారు.
ఇప్పుడు సాధారణ ఎన్నికలు ఒకో రాష్ట్రంలో 3 నెలలు ముందు జరగొచ్చు. అయితే దానికోసం శాసన సభ జీవితాన్ని ముందే చంపేయరు. నేడు ఎన్నికలు జరుతున్న రాష్ట్రాల్లో నవీన్ పట్నాయక్, చంద్రబాబు గార్లకు ఉన్న అధికారాలే కొద్ది తేడాతో ప్రధాని మోదీజీకి ఉంటాయి. ఎన్నికలు ప్రకటించి, కోడ్ వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం చేయకుండా కొన్ని నిబంధనలు ప్రభుత్వం/ ఆధికారంలో ఉన్నవారు పాటించాలి. అయితే వారే పాలన సాగిస్తారు. అయితే స్టేట్ పరిపాలన మొత్తం రాష్ట్రాల్లో చీఫ్ సెక్రటరీ లేదా కేంద్రం ఆదేశాలలోకి, ఎన్నికల కమిషన్ కనుసన్నల్లోనే లేదా వారి చేతుల్లోకి పోదు, అలాగే కేంద్రంలో ప్రదానికి పోయి క్యాబినెట్ సెక్రటరీ చేతుల్లో అధికారం దఖలు పడదు.
కోడ్ వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడే ఈ గాప్ రెండు మూడు నెలలు ముఖ్యమంత్రులు, ప్రధానులు మూల కూర్చుని, అధికారులే ప్రధానులు, ముఖ్యమంత్రులుగా వ్యవహరించరు, అవ్వరు. సంస్కరణలు ఉండాలి గాన, ఎన్నికలు కచ్చితంగా నిష్పక్షపాతంగా జరగాలని భావిస్తే అలాంటప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు కేంద్రంలో సుప్రీంకోర్టు రాష్ట్రాల్లో హైకోర్టుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని సంస్కరణలు తీసుకురావాలి. అవసరమైతే ఆర్మి సహాయం తీసుకోవచ్చేమో ఆలోచించాలి. ఇది ఇవ్వాళ ఒక నచ్చని, నచ్చిన ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తే రాష్ట్రాలు ఈ అంశంలో కూడా అధికారాలు ఉడిగిన ప్రభుత్వ స్తంభాలుగా మిగులుతాయి, వచ్చే ప్రభుత్వాలు కూడా కేంద్ర మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది.