రాష్ట్రానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు, దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదంటూ నిర్ణయం తీసుకుని చంద్రబాబు దేశ వ్యాప్త చర్చకు దారి తీసారు. సీబీఐలోని ఉన్నతాధికారులే విభేదాలతో వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావటం, ఈ విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉండటం, సిబిఐ ను మోడీ-షా పావులుగా చేసుకోవటంతో, చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, మోడీ-షా లతో పాటు ఢిల్లీ అధికార వర్గాలు కూడా ఈ నిర్ణయంతో అవాక్కయ్యాయి. చంద్రబాబు ఇంత దూకుడుగా వెళ్తారని వాళ్ళు ఊహించలేదు.

delhi 19112018 2

డీజీపీగా నండూరి సాంబశివరావు నియామకం సందర్భంలో కూడా, కేంద్రం అనేక ఇబ్బందులు పెట్టింది. డీజీపీ ఎంపిక అనేది కేంద్రం చేతిలో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ నియామకం కోసం కొందరు సీనియర్‌ అధికారుల పేర్లను పంపితే.. వాటిలో ఎవరిని ఎంపిక చేయాలన్నది కేంద్రం ఇష్టం. అయితే ఆ జాబితాలో సాంబశివరావు పేరు ఉండడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిప్పి పంపింది. అయితే దీనికి చంద్రబాబు ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సాంబశివరావుతో కూడిన జాబితానే మళ్లీ పంపింది. పంపడం వరకు తమదే అధికారమని, పంపిన వారిలో ఎవరిని ఎంపిక చేస్తారనేది మీ ఇష్టమని పేర్కొంది. అంతే తప్ప అసలు జాబితా రూపకల్పనతోనే కేంద్రం జోక్యం ఏంటని ప్రశ్నించింది.

delhi 19112018 3

అయితే కేంద్రం మాత్రం కుదరదు అని సంకేతాలిచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి.. అసలు డీజీపీని నియమించే అధికారం కేంద్ర కమిటీకి ఇవ్వడమెందుకు? రాష్ట్ర ప్రభుత్వమే ఆ అధికారాన్ని ఉపయోగించుకుంటే సరిపోతుందని నిర్ణయించింది. ఒక రాష్ట్ర డీజీపీ ఎంపికను యూపీఎస్సీ కమిటీకి ఇవ్వడమా? రాష్ట్ర ప్రభుత్వమే చేసుకోవడమా? అన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమే. దీంతో డీజీపీ ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తెస్తూ.. ఆ మేరకు అవసరమైన చట్టపరమైన మార్పులను చేశారు. దీంతో ఆ విషయంలో కేంద్రం పెత్తనానికి అడ్డుకట్ట పడింది. ఈ నేపథ్యంలో రెండుసార్లు కేంద్రంతో ఢీకొట్టిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ఏమైనా చేయనుందా? అని ఢిల్లీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. బాబు తదుపరి వ్యూహం ఏంటి? అంటూ ఢిల్లీ వర్గాలు ఆసక్తిగా ఆరా తీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు.. ఏపీలోని తమ బ్యాచ్‌మేట్లు, తెలిసినవారికి ఫోన్‌ చేసి అడుగుతున్నారు. తదుపరి చర్యలు ఏంటి? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ఆసక్తిగా అడుగుతున్నారు. రాష్ట్ర అధికారులు, రాష్ట్రంలోనే ఉండాలని, ప్రతిదీ కేంద్రం దగ్గర ఎందుకని, ఇంకా ఏమి ఉన్నాయో అన్నీ మన పరిధిలోనే పెట్టుకుందామని, చట్ట ప్రకారం వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న వేళ, నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read