రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. భాగస్వామ్య సదస్సుకు ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 40 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సదస్సులో 11 అంశాలపై ప్లీనరీ సెషన్లు నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఇప్పటికే 400 అవగాహన ఒప్పందాలకు ప్రతిపాదనలు వచ్చాయి.. సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం సాయంత్రం 3గంటలకు ప్రారంభించారు.. తరువాత చంద్రబాబు మాట్లాడారు... తాను ఎంత ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అనేది, ఒక ఛాలెంజ్ విసిరి చెప్పారు...
"నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా... మీరే చూసి, మా పని ప్రభుత్వ పని తీరు చూడండి అంటూ " మాతో ఒక ఏంఓయు కుడుదుర్చుకోండి... నా పని తీరు, మా ఆంధ్రప్రదేశ్ టీం పని తీరు చూడండి... మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది చూడండి... నాకు గట్టి నమ్మకం ఉంది, మా విధానాలతో మీరు మా రాష్ట్రంలో బిజినెస్ చెయ్యటానికి ముందుకొస్తారు... కియా కంపెనీలాగా, మాతో కలిసి పని చెయ్యటానికి, మా పని తీరుకు మీరు ఫిదా అయిపోతారు... మరిన్ని పెట్టుబడులు పెడతారు" అంటూ, ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్సు నింపి, వారు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేలా చంద్రబాబు పారిశ్రామిక వర్గాలకు చిన్న పాటి ఛాలెంజ్ లాంటింది విసిరారు...
చంద్రబాబు ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2022 నాటికి దేశంలో మూడో స్థానంలో... 2029 నాటికి అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని. మూడోసారి సీఐఐ సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈసారి స్పందన బాగుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో శాశ్వత కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్స్, హోటళ్లు ఏర్పాటు, రాష్ట్రంలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ఈసారి రాష్ట్రంలో 13.8 శాతం లోటు వర్షపాతం నమోదన్నారు. వ్యవసాయంలో గణనీయ వృద్ధిరేటు సాధిస్తున్నామని, నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు వివరించారు.