తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విపక్ష పార్టీలకు సూటిగా సవాల్ విసిరారు. ఎటువైపు ఉండాలో వైసీసీ, జనసేన తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీ వైపు ఉంటారో, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడతారో తేల్చుకోవాలని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు సూటిగా చేసిన ఈ ఛాలెంజ్‌తో రాజకీయాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందా? బీజేపీతో ఎలాంటి సంబంధాలు లేవని వైసీపీ, జనసేన ప్రకటిస్తాయా? కేంద్రంపై సమరానికి ప్రభుత్వంతో కలిసి వస్తాయా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు బీజేపీతో పొత్తుపెట్టుకుని కేంద్రంతో భాగస్వామిగా ఉన్న టీడీపీ, రాష్ట్రానికి ఏ మాత్రం సహాయం చెయ్యని బీజేపీతో ఇప్పుడు అన్ని బంధాలను తెంచేసుకుని ఆ పార్టీపై తాడే పేడే అన్నట్లుగా పోరాడుతోంది. అదే సమయంలో ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ.. బీజేపీతో బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. హోదా, విభజన హామీల విషయంలో ఆ పార్టీ ఏపీలో అధికార పార్టీనే విమర్శిస్తున్నారు కానీ, ఇవ్వాల్సిన కేంద్రంపై ఈగ వాలనీయడంలేదు. చివరికి మోదీని విమర్శించారని, నేరుగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి అమితమైన అభిమానాన్ని ఆ పార్టీ నేతలు చూపిస్తున్నారు. అదే సమయంలో కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ మద్దతు ప్రకటించారు. బళ్లారి లాంటి జిల్లాలో వైసీపీ కార్యకర్తలే బీజేపీ బరువు బాధ్యతలు మోశారు. ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో పొత్తు పెట్టుకుంటామని చెప్పడంలేదు. అలా అని విమర్శలు కూడా చేయడం లేదు.

cbn challange 05062018 2

ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతోపాటు ఎన్డీయేలో ఉన్న మరోపార్టీ జనసేన. హోదా విషయంలో మొదట్లో టీడీపీ, బీజేపీలతో తీవ్రంగా విభేదించి.. బీజేపీపై, మోదీపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఏపీలో బీజేపీ చచ్చిపోయిందన్నారు. తాను ఎన్డీయేలో లేనని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ హఠాత్తుగా పవన్ తన స్టాండ్‌ను మార్చేసుకున్నారు. ఏపీలోని అన్ని వర్గాలూ ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వాములైనప్పుడు పవన్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆ సమయంలోనే నాలుగో ఆవిర్భావ దినోత్సవ సభ పెట్టి హోదాపై మినహా అన్ని మాట్లాడారు. అప్పటి నుంచి పవన్ కేంద్రంపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు. హోదా ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నారే గానీ అంతకుమించి డిమాండ్ నోటి వెంట రావడం లేదు. కొన్నాళ్ల క్రితం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీకి హోదా ఇవ్వకపోయినా పర్వాలేదని, నిధులు ఇస్తే చాలని అన్నారు. అప్పుడే మోదీకి తాను సన్నిహితుడునని, ఆయన అంటే తనకు అభిమానమని చెప్పుకొచ్చారు. ఆయన బీజేపీ ఆత్మీయుడైపోయారు.

cbn challange 05062018 3

టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చినప్పటి నుంచే పవన్ టీడీపీ వ్యతిరేకంగా మారారని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలు వద్దని చంద్రబాబు అన్నారు. లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం చేసుకుని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. దీనిపై నేరుగా సీఎం వైసీపీ, జనసేనకు సవాల్ విసిరారు. అయితే బీజేపీతో కలిసి నడుస్తున్నట్లు బహిరంగంగా చెప్పుకోవాలని, లేకపోతే రాష్ట్రం కోసం పోరాడేందుకు కలిసి రావాలని అన్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ గెలవడం కన్నా చంద్రబాబును ఓడించడమే టార్గెట్ అని ఈ విషయాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి ఒకరు మీడియాకు చెప్పారు. అందుకే కొత్త కొత్త రాజకీయ సమీకరణాలకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఏపీలో బీజేపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈసారి తనకు మద్దతు ఇచ్చే పార్టీలైనాసరే తాను లేకుండా కలిసి పోటీ చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కౌంటర్ గానే చంద్రబాబు సవాల్ చేసినట్లు సమాచారం. దీనిపై వైసీపీ, జనసేనలు ఎలా స్పందిస్తాయోనని టీడీపీ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

 

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read