ఇక్కడ మనందరం, దీపావళి పండుగ హడావిడిలో ఉన్నాం... మన కుటుంబ సభ్యులతో కలిసి, షాపింగ్ చేస్తున్నాం, స్వీట్లు కొంటున్నాం, టపాసులు కొంటున్నాం... పూర్తి పండుగ వాతావరణంలో ఉన్నాం... కాని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మన రాష్ట్రంలో పెట్టుబడులు కోసం చికాగో పర్యటనకు బయలుదేరి వెళ్లారు... వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి, జెట్ లాగ్ కూడా లేకుండా పనిలోకి దిగిపోయారు... నిన్న అమరావతి, వైజాగ్, నాగపూర్, ఢిల్లీ, నుంచి చికాగో చేరుకున్నారు... ఇంత బిజీ షడ్యుల్ లోనూ, ఆయన విశ్రాంతి తీసుకోకుండా, వెంటనే పని మొదలు పెట్టారు..
చికాగో చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి అక్కడి, తెలుగు వారు ఘన స్వాగతం పలికారు. ఈ రాత్రి 8:30 గంటలకు (IST) G-TEN సభ్యులతో జరిపే సమావేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి 9 గంటలకు (IST) ఐటీ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. గ్లోబల్ తెలుగు ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్వర్క్ (జీ టెన్) పేరుతో విదేశాల్లోని తెలుగువారి ఉన్నతికి క్రుషి చేస్తుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాత్రి 10 గంటలకు (IST) ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం డెమోయిన్స్ పయనం అవుతుంది.
ఈ రాత్రి ఒంటిగంటకు (IST) ఐయోవా స్టేట్ యూనివర్సిటీ సందర్శన. రాత్రి 1:30కు (IST) వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్ సందర్శన. రాత్రి 2:30కు (IST) ISU రీసెర్చ్ పార్కులో రౌండ్ టేబుల్ సమావేశం. స్టేటస్ రిపోర్ట్, నాలెడ్జ్ కన్సార్టియం. తెల్లవారుజాము 5:20కు (IST) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐయోవా గవర్నర్ విందు. ఆ తరువాత.. కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్ పార్కు ప్రాజెక్టుపై 350 మందితో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్, టాప్ సైంటిస్టులు, సీడ్ కంపెనీలు, అగ్రీ కంపెనీల ప్రతినిధులతో కర్నూలు సీడ్‌పార్కుపై ప్రెసెంటేషన్ ఇస్తారు. ఇలా మొదటి రోజు పర్యటన ముగియనుంది.