చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుపతి చిత్తూరులో, తెలుగుదేశం నాయకులను హౌస్ అరెస్ట్ చేసారు. చంద్రబాబుకు ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలకటానికి వస్తున్న నేతలను, అరెస్ట్ చేసారు. ఎయిర్ పోర్ట్ కు వెళ్ళే దారిలో పోలీసులు మొహరించారు. ఎవరినీ అనుమతించటం లేదు. ఎయిర్ పోర్ట్ దగ్గరకు ఎవరూ రాలేని పరిస్థితి ఉంది. చంద్రబాబు ఈ రోజు వైసీపీ అరాచకాల పై, చిత్తూరులో నిరసన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుపతిలో, 43వ డివిజన్ లో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్ధి టీ కొట్టుని నిన్న పడేసారు. అక్కడకు కూడా చంద్రబాబు వెళ్లనున్నారు. అయితే ఈ రెండు కార్యక్రమాలను అనుమతి లేదని, పోలీసులు చెప్తున్నారు. నిన్న టిడిపి నేతలు అనుమతి కోరినా, వినతి పత్రం పోలీసులు తీసుకోలేదని, దీంతో వాట్స్ అప్ లో, పోలీసులకు అనుమతి కోరినా, చివరకు నిన్న అర్ధరాత్రి అనుమతి లేదని చెప్పటం జరిగింది.
చంద్రబాబు చిత్తూరు పర్యటన... అనుమతి ఇవ్వని ప్రభుత్వం.. చిత్తూరులో టెన్షన్ టెన్షన...
Advertisements