ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై సమరభేరి మోగించేందుకు సన్నద్ధమవుతున్నారు. విభజన అంశాల అమలు, ప్రత్యేక హోదా, తదితర అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని దేశప్రజలందరికి తెలిసేలా దేశ రాజధాని ఢిల్లిలో ఒక రోజు దీక్షకు దిగనున్నారు. ఈ మేరకు శనివారం ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ వేదికగా ఏపీ ప్రజల మనోభావాలను దేశవ్యాప్తంగా తెలియజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి ఇప్పటికే ఎంపీలు ఎండగట్టే విధంగా దిశానిర్దేశం చేస్తున్న ఆయన స్వయంగా నిరసన దీక్షకు చేపట్టనుండటంతో జాతీయ రాజకీయాలల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున ఈ దీక్షాస్త్రాన్ని సంధించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

modi 27012019

ఇప్పటికే కేంద్రం నవ్యాంధ్రకు ఇచ్చిన చట్టబద్ధమైన హామీలను నెరవేర్చడం లేదని ధర్మపోరాట దీక్షలు చేస్తున్న ఆయన గత ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలోని ఇందిగాంధీ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు నిరసనదీక్ష చేశారు. ముఖ్యమంత్రి దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాలలో సైతం దీక్షలు జరిగాయి. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ఢిల్లి వెళ్లి పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని వారికి వివరించి మద్దతు కోరారు. కొన్ని పార్టీల నేతలు ఈ సందర్భంగా పార్లమెంట్‌ సమావేశాలలో సైతం ఏపీకి జరిగిన అన్యాయం తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మాట్లాడారు. అనంతరం జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించే దిశగా అడుగులు వేస్తూ 23 పార్టీలను ఒకె తాటిపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే ఢిల్లి, కోల్‌కత్తాలలో ఎన్‌డిఎకు వ్యతిరేకంగా సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి తన సత్తా చాటారు.

modi 27012019

ఇది ఇలా ఉంటే ఇవి చిట్టచివరి పార్లమెంట్‌ సమావేశాలు కావడంతో ఈ సమావేశాలలో రాష్ట్ర సమస్యలు అధికార ఎన్‌డిఎ పరిష్కరించకపోతే నిరసన దీక్షను చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం జరిగినా ఎంపిలతో తన మనోభావాలను పంచుకోవడంతో పాటు వారి అభిప్రాయాలను ఈ అంశంపై తెలుసుకున్నారు. ఎంపి సుజనా చౌదరితో పాటు, కింజరపు రామ్మోహన్‌నాయుడుతో పాటు మరికొందరు ఎంపీలు ఈ దీక్షకు జాతీయ స్థాయి పార్టీలు, నేతల కూడా మద్దతు ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ అంశంపై ఇంక పూర్తి స్థాయిలో పార్టీ వర్గాలు, ముఖ్యనేతలతో చర్చించి ఒక నిర్ణయానికి వద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా సమాచారం. సీఎం దీక్ష చేపట్టిన రోజు సంఘీభావంగా రాష్ట్రమంతటా పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఢిల్లిలో ముఖ్యమంత్రి దీక్షకు మద్దతుగా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెెల్సీలు పాల్గొనే విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు. దీక్ష ద్వారా ఒకే సారి రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం తీసుకురావడంతో పాటు, రాష్ట్రహక్కుల కోసం పోరాడుతున్న పార్టీగా ప్రజల్లో గుర్తింపు వచ్చేలా వ్యూహరచన చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read