ఎన్నికల సంవత్సరంలో కూడా చంద్రబాబు ఎక్కడ బాలన్స్ తప్పటంలేదు... సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే, ఆయన విజన్ కలెక్టర్ల ముందు పెట్టారు... రాబోయే రోజులకు గాను మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సంతృప్తి స్థాయికి చేరుకునేలా సంపూర్ణ మౌలిక వసతుల కల్పనను తొలి ప్రాధాన్య అంశంగా తీసుకున్నారు. పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనను రెండో ప్రాధాన్య అంశంగా, ఆరోగ్యం- పౌష్టికాహారం మూడో ప్రాధాన్య అంశంగా భావిస్తున్నారు. తయారీరంగాన్ని కూడా ప్రాధాన్య అంశాల జాబితాలో చేర్చారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ప్రాధాన్య అంశాలేమిటో మంగళవారం ఇక్కడ జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో అధికారులు వెల్లడించారు. .

collectors 08052018 2

నీతిఆయోగ్ సూచికల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన మైలురాళ్లను కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. వ్యాపార సంస్కరణ కార్య ప్రణాళిక అమలులో (బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌)లో నూరుశాతం స్కోరుతో రాష్ట్రం తొలి ర్యాంకు సాధించడం విశేషం. వ్యవసాయోత్పత్తుల విపణి-రైతులతో స్నేహపూరిత సంస్కరణల సూచికలో (అగ్రికల్చరల్ మార్కెటింగ్-ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్-2016)లో 56.2 స్కోరుతో ఏపీ 7వ ర్యాంకు సాధించినట్టు అధికారులు వెల్లడించారు. ఆరోగ్యరంగ ప్రగతి సూచిక (పెర్ఫామెన్స్ ఆన్ హెల్త్ అవుట్ కమ్ ఇండెక్స్-2016)లో 0.62 శాతం స్కోరుతో మన రాష్ట్రం 10 వ ర్యాంకులో ఉన్నట్టు వివరించారు. తాజా ఆరోగ్య సూచిక (హెల్త్ ఇండెక్స్ 2018)లో 60.16 స్కోరుతో 8వ ర్యాంకు సాధించామని ప్రకటించారు. పాఠశాల విద్య ప్రమాణాల సూచిక (స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్-2016)లో 56 శాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ 17 వ ర్యాంకు సాధించినట్టు తెలిపారు.

collectors 08052018 3

గ్రామీణ మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతిని అధికారులు కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. రాష్ట్రంలో అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం ఎల్‌పీజీ కనెక్షన్లను అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించామని, గ్రామీణ ప్రాంతాలలో నూరుశాతం ఓడీఎఫ్ అమలు చేస్తున్నామని తెలిపారు. 80శాతం శివారు గ్రామాలన్నీ 0.5 శాతం పరిధిలో రహదారులకు అనుసంధానం చేసినట్టు చెప్పారు. 30,500 కిలోమీటర్ల మేర గ్రామాలలో అంతర్గత సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తి చేసినట్టు వివరించారు. 2018-19లో 9,765 గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్ధ పదార్థాల నిర్వహణ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. 24,783 శివారు గ్రామాల ప్రజానీకానికి ఒక్కొక్కరికీ 55 లీటర్ల చొప్పున మంచినీటి సరఫరా లక్ష్యంగా నిర్దేశించారు. 10,754 గ్రామ పంచాయతీలో ఎల్ఈడీ వీధి దీపాల సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 10,344 శివారు గ్రామాలలో బీటీ రహదారులను ఏర్పాటు చేయాలన్న కొత్త లక్ష్యాన్ని ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read