ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే, రాజకీయ చానిక్యతకు మారు పేరు.. గతంలో, కేంద్రంలో రెండు ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యటంలో కీలక పాత్ర పోషించారు... 20 ఏళ్ళ క్రితమే, ఆయన్ను ప్రధానిగా ప్రతిపాదించగా, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెయ్యల్సింది చాలా ఉంది అని, ఆ ప్రతిపాదన తిరస్కరించారు... వాజ్ పాయి ప్రధానిగా ఉండగా కూడా, ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటూ, ఒక్క మంత్రి పదవి కూడా తీసుకోకుండా, రాష్ట్రానికి సహకరించండి అని మాత్రమే అడిగారు.. ఇప్పుడు ఉన్న సీనియర్ నాయకుల్లో చంద్రబాబు ఒకరు.. నిన్న బెంగుళూరులో కూడా, మమతా బెనర్జీ స్వయంగా చంద్రబాబుని ఒక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యమని, మోడీ వ్యతిరేక పోరాటాన్ని లీడ్ చెయ్యమని అడిగారు... అది చంద్రబాబు సత్తా... మొన్న లండన్ లో కూడా, ఒక అవార్డు తీసుకునే సందర్భంలో, చంద్రబాబుని "పొటెన్షియాల్ ప్రైమ్ మినిస్టర్ అఫ్ ఇండియా" అని సంబోధించారు...
అలాంటి చంద్రబాబు, 20 ఏళ్ళ క్రిత్రం ఏ మాట చెప్పారో, ఈ రోజు అదే మాట చెప్పారు.. తెలంగాణ టీడీపీ మహానాడుకు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. కార్యకర్తలు పీఎం.. పీఎం అంటూ నినాదాలు చేస్తుంటే, ఆయన స్పందిస్తూ, ప్రధాని కావాలని లేదని... తనకు తెలుగు జాతి ముఖ్యమని.. 22 ఏళ్ల క్రితమే ఆమాట చెప్పాను అన్నారు. ప్రధాని పదవి ఆశ లేదని.. ఎంతగా అరిచినా ఆ కోరిక కలగదని తేల్చి చెప్పారు. 1996లో తృతీయ కూటమి ఏర్పాటుచేసి దేవెగౌడను ప్రధానిగా చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్‌కు, భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుచేసిన ఘనత తెదేపాదన్నారు. తనకు ప్రధాని పదవి అవసరం లేదని 20 ఏళ్ల క్రితమే చెప్పానన్నారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికీ వద్దని చెప్పానన్నారు.
ప్రధాని పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నానంటే.. పదవుల కోసం కాదని, ప్రజాసేవ కోసమేననిఅన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. నాడు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్‌కు రూపకల్పన చేశారని చంద్రబాబు కొనియాడారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దేవెగౌడను ప్రధానిని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో పెను మార్పులు వస్తాయని ఆయన అన్నారు. దేశ రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.