ఇనుముని కూడా నానబెట్టే అంత ఓర్పు ఉండే చంద్రబాబుకే విసుగు పుట్టించారు ఢిల్లీ పెద్దలు... చేసేది లేదు అని లీకులు ఇస్తూ, చివరకు మన సెంటిమెంట్ ను, ఆత్మాభిమానాన్ని కూడా కించ పరుస్తూ లీకులు ఇవ్వటంతో, చంద్రబాబు కూడా విసుగెత్తిపోయారు.. వారు ఆన్ రికార్డు చెప్పగానే, మనం నిర్ణయం తీసుకుందాం అంటూ నేతలను రెడీ చేస్తున్నారు... ఢిల్లీలోని ఏపీ ఎంపీలు, కేంద్రమంత్రులతో ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని నిన్న జరిగిన టీడీఎల్పీలో 95శాతం ఎమ్మెల్యేలు చెప్పిన విషయాన్ని ఎంపీలకు చంద్రబాబు తెలియజేశారు. ప్రజాభిప్రాయం కూడా ఇదే అని చెప్పారు...
కేంద్రం ఇలా లీకులు కాకుండా, వారు మన హామీల పై పార్లిమెంట్ వేదికగా స్పందిచేలా చెయ్యండి... వారు అఫిషయల్ గా చెప్పగానే, మనం నిర్ణయం తీసుకుందాం... రెడీగా ఉండండి అంటూ ఎంపీలను సమాయత్తం చేసారు... ఏపీ విషయంలో కేంద్రం వైఖరిపై టీడీపీ ఎంపీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడం లేదన్న కేంద్రం వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడంలో దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు. .. పోలవరానికి ఇచ్చిన నిధులకు ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నామని, యూసీలు ఇవ్వకుండా నిధులు ఎలా ఇస్తున్నారని సీఎం ప్రశ్నించారు.
రెవెన్యూలోటు కింద ఇచ్చిన నిధులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర సంస్థలకు ఇచ్చిన రూ.600కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్‌లు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, వాటి ఆధ్వర్యంలో ఉన్న శాఖలని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని జాతీయమీడియాతో చెప్పాలని ఎంపీలకు ఆదేశించారు. మరోవైపు రాజ్యసభలో విజయసాయి వ్యవహారశైలిపై టెలికాన్ఫరెన్స్‌లో చర్చకు వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే విజయసాయి కనీసం సీటు నుంచి కదలలేదన్న విషయాన్ని చంద్రబాబుకు ఎంపీలు తెలియజేశారు. సభలో ప్రధాని ఉంటే గాంధీ విగ్రహం దగ్గర, ప్రధాని లేకపోతే సభలో ఆందోళన చేస్తున్నారని చంద్రబాబుకు ఎంపీలు చెప్పారు. వైసీపీ వైఖరి ఏంటో ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయిందని ఎంపీలు తెలిపారు.