ఒక పక్క 8 రోజులుగా సియం రమేష్ దీక్ష చేస్తున్నా, కేంద్రం కనీసం స్పందించటం లేదు. మరో పక్క, ఎంపీలు వెళ్లి కేంద్ర మంత్రిని కలిసినా, నా చేతిలో ఏమి లేదు అని చేతులు ఎత్తేసారు.. ఈ సమయంలో చంద్రబాబు, మరో షాకింగ్ న్యూస్ చెప్పారు. డిగిన ప్రశ్నలే రెండు, మూడు సార్లు అడుగుతూ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. బుధవారం ఆయన తెదేపా ఎంపీలు, కడపలో ఉక్కు దీక్ష నేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ కడపలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సీఎం రమేశ్‌, బీటెక్‌ రవిల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రికి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వివరించారు.

cbn 27062018 2

ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారడంతో దీక్షను భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్పించిన బీటెక్‌ రవికి అందిస్తున్న చికిత్సపై సీఎంకు పలువురు మంత్రులు వివరించారు. ఉక్కు శాఖ మంత్రితో చర్చల సారాంశాన్ని సీఎంకు వివరించిన జేసీ.. ఉక్కు పరిశ్రమపై దిల్లీలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు. రేపు మరోమారు కేంద్రమంత్రి బీరేంద్రసింగ్‌ను కలవనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రమంత్రికి తాను మరో లేఖ రాస్తానని, రేపటి భేటీలో ఆ లేఖను ఆయనకు అందజేయాలని సూచించారు. 2020లోగా మూడు గనులు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయని, ప్రస్తుతం ఇచ్చిన భూముల్లో 87 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉందన్నారు. మూడు గనులు అందుబాటులోకి వస్తే 266 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉంటాయని వెల్లడించారు.

cbn 27062018 3

ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు 150 మిలియన్‌ టన్నులు ఉంటే సరిపోతుందన్నారు. 116 మిలియన్‌ టన్నుల నిక్షేపాలు ఉంటే ఇంకా కేంద్రానికి అభ్యంతరం ఎందుకు?అని ప్రశ్నించారు. కర్మాగారం పూర్తిచేసేందుకు రెండేళ్లు పడుతుందని, ఆ లోపు మిగిలిన మూడు గనులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. ఉక్కు దీక్ష ప్రారంభమయ్యాక కేంద్రం మరో రెండు కొత్త కొర్రీలు వేసిందని, మొన్నటి దాకా తెలంగాణ ప్లాంట్‌ పై స్పష్టత లేదన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. బయ్యారం భూములు, నీళ్ల వివరాలు రాలేదన్నారని తెలిపారు. కడపలో రాష్ట్రం ఇచ్చే భూములపై ఏ వివాదమూ లేదని స్పష్టంచేశారు. కానీ, కావాలనే కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. విభజన చట్టంలో హామీ నెరవేర్చేందుకు ఎందుకీ జాప్యమని నిలదీశారు. రాష్ట్రం పట్ల కేంద్రం తన మొండి వైఖరిని వీడి హామీలు నెరవేర్చాలని చంద్రబాబు కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read