ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శాసనమండలిలో మోడీని, జగన్ పార్టీని, పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులని ఎండగట్టారు... విజయసాయి రెడిని అయితే, ఒక ఆట ఆడుకున్నారు... నిన్న విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుని జైలుకి పంపిస్తా అని, అందుకోసం మోడీని, కలుస్తూనే ఉంటా అని, రోజు కలుస్తా అని, ఏమి చేస్తారో చేసుకోండి అంటూ, రెచ్చిపోయిన సంగతి తెలిసిందే... ఈ విషయం ప్రస్తావిస్తూ, చంద్రబాబు విజయసాయిని ఎండగట్టారు... పీఎంవోలో కూర్చోవడం, ప్రెస్ వారికి కనపడకుండా దాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. నేరస్తులకు పీఎంవో గస్తీ కాస్తుందా? అని వ్యాఖ్యానించారు.

cbn assembly 22032018 2

పీఎంవో చుట్టూ తిరిగే విజయసాయి రెడ్డి తనను బోనులో పెట్టిస్తానంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీలు పీఎంను కలవొచ్చని బాబు ప్రసంగానికి మాధవ్‌ అడ్డుతగిలే ప్రయత్నం చేయగా.. అవినీతిపరులకు పీఎంవో గస్తీ కాస్తుందా? అని చంద్రబాబు మండిపడ్డారు. అవినీతిపరులతో పీఎంవోలో కాపురం పెట్టుకున్నా తమకేం నష్టంలేదని అడిరిపోయే పంచ్ వేసారు.. అవసరం అయితే కాపురం పెట్టుకోండి అయ్యా, నాకేంటి, అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు... అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తి సీబీఐ మాజీ డైరెక్టర్‌ను కలిస్తే కేసులు పెట్టారనే విషయాన్ని సీఎం గుర్తుచేశారు. తాను, తన కుటుంబం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టంచేశారు.

cbn assembly 22032018 3

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడం తన జీవిత ఆశయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి దాని నిర్మాణం చేపడుతుంటే బురద చల్లే కార్యక్రమాలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తుంటే దానిలో అవినీతి జరిగిపోతోందని, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. తానే రోజూ లాలూచీ పడలేదని స్పష్టంచేశారు. పోలవరం కోసం ఇప్పటి వరకు రూ.13,201 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. దేశంలోని 16జాతీయ ప్రాజెక్టుల్లో 11 ప్రాజెక్టుల పనులే ప్రారంభం కాలేదు. కేంద్రం చేపడితే ప్రాజెక్టు త్వరగా పూర్తికాదనే మేం బాధ్యత తీసుకున్నాం అని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read