రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు స్వయంగా ఫిర్యాదు చేసారు. ఆయన ఫిర్యాదు ఇలా ఉంది.. "అధికారులు మూడు దశల్లో ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులను వేధిస్తున్నారు. మొదటి దశలో సంబంధిత పత్రాలు ఇవ్వకపోవడం, రెండో దశలో అక్రమకేసులు మోపడం, మూడో దశలో నామినేషన్లు వేసే వారిపై భౌతిక దా-డు-ల-కు దిగడం వంచి చర్యలకు పాల్పడుతున్నారు. 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల, పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో హిం-సా-త్మ-క సంఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్ల, పుంగనూరులో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఉండి పోలీసలు ఇతర పార్టీల వారిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. ఏకగ్రీవాల కోసం పెద్ద ఎత్తున అరాచకాలకు తెరలేపారు. రెవెన్యూ అధికారులు ఎటువంటి సహకారం అందించడం లేదు. కుల దృవీకరణ, నో డ్యూస్ పత్రాలివ్వడం లేదు. దీనిపై తక్షణమే స్పందించాలి. నామినేషన్లకు ఇంక ఒక్కరోజే మాత్రమే గడువుంది. దీనిపై చర్యలు తీసుకుని సంబంధిత అధికారులు సహకరించేలా చూడండి. శాంతియుతంగా నామినేషన్లు ప్రక్రియ జరిగేలా చూడాలి. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీ నాయకులు మాచర్లలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఇతర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవేళ అభ్యర్థులు పోలీసుల బెదిరింపులకు లోనవుకుంటే వెంటనే వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. "
"అక్రమ మద్యం, గంజాయి కేసులను పోలీసులు బనాయిస్తున్నారు. రెంటచింటల గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా బలహీన వర్గాలకు చెందిన దండె అంకమ్మ భర్తపై తప్పుడు కేసులు పెట్టారు. ఫిబ్రవరి 7న ఉదయం 7 గంటలకు దండే శివయ్యను అరెస్ట్ చేసి వేధించారు. అదేవిధంగా పసర్లపాడు గ్రామ పంచాయతికి నామినేషన్ వేయడానికి సిద్ధమైన యాదవ సామాజిక వర్గానికి సవాలా రామరాజును వైసీపీ నాయకులు అడ్డుకుని దాడి చేశారు. జమ్మలమడక గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమైన తరుణంలో బాలు నాయక్ ను వైసీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. దుర్గి మండలంలో ఓబులేసునిపల్లెకు సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్ళిన ఓర్సు వెంకట్రావుపై వైసీపీ నాయకులు దా-డి-కి పాల్పడ్డారు. పుంగనూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సోడమ్, సోమల మండలాల్లో వైసీపీ గూం-డా-లు, పోలీసు, రెవెన్యూ అధికారులు అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సోడమ్ మండలంలో ఎంపీడీవో కార్యాలయానికి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థులపై భౌతిక దా-డు-ల-కు తెగబడ్డారు. దీనిపై చర్యలు తీసుకుని తక్షణమే నామినేషన్ల కార్యాలయాలను మార్చాలి." అంటూ చంద్రబాబు ఫిర్యాదు చేసారు.