ఇది భారత రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజపేయి మూర్తి పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం సందేశం... "అటల్ బిహారీ వాజపేయి మృతితో భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఆయన మృతి భారత దేశానికి తీరనిలోటు..వాజ్ పేయి ఉదారవాది, మానవతావాది.. కవి, సిద్ధాంతకర్త. మంచి వక్త..నిరాడంబరుడు.. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేశారు.. తాను నమ్మిన ఆదర్శాలను నిజజీవితంలో ఆచరించి చూపించారు. ఎంపిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా, బహుముఖ పాత్ర పోషించారు. అత్యత్తమ పార్లమెంటేరియన్. పార్లమెంటులో అద్భుతమైన ప్రసంగాలతో సమకాలీకులకు మార్గదర్శకం చేశారు. పార్లమెంటేరియన్ గా 4దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది.

atal 1602018 2

10సార్లు లోక్ సభకు,రెండుసార్లు రాజ్యసభకుఎన్నికైనారు. జనసంఘ్ అధ్యక్షుడిగా,జనతా పార్టీ నాయకుడిగా,తరువాత బిజెపి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానిగా విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో తన ప్రభుత్వం ఓడిపోయినా ఏమాత్రం చలించని మేరునగ ధీరుడు. 13రోజులు ప్రధానమంత్రిగా పనిచేసినా,13నెలలు ఉన్నా,పట్టుదలతో పనిచేసి 5ఏళ్లు ప్రధానిగా దేశ ప్రజలపై చిరకాల ముద్రవేశారు. అన్ని తరాల వారితో కలిసి పని చేసిన ఘనత వాజ్ పేయికే దక్కుతుంది, ఐదు తరాలకు వారధి... 1984లో కేవలం 2సీట్లకే పరిమితం అయిన భారతీయ జనతాపార్టీని ఈ రోజు 270 సీట్లకు బిజెపి ఎదిగేలా చేయడంలో అటల్ బిహారీ వాజ్ పేయిదే ప్రధాన పాత్ర.

atal 1602018 3

వాజ్ పేయి మంత్రివర్గంలో ఏడెనిమిది మంత్రి పదవులు ఇవ్వడానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బైటనుంచి ఎన్డీఏ-1ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చామే తప్ప మంత్రి పదవులు తీసుకోలేదు. అబ్దుల్ కలామ్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రతిపాదించడంలో కూడా నేనే స్వయంగా చొరవ తీసుకుని అటు వాజ్ పేయితో మాట్లాడటం,ఇటు అబ్దుల్ కలామ్ ను ఒప్పించడంలో క్రియాశీలంగా వ్యవహరించాను. ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలలో పెద్దఎత్తున ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేశారు. గత 32 ఏళ్లలో అభివృద్ధి చెందిన రోడ్లలో సగం, వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఎ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి చెందినవే . నదుల అనుసందానానికి,స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణానికి విశేష కృషి చేశారు.

cbn atal 16082018 3

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వాజ్ పేయి తోడ్పాటు: తడ నుంచి ఇచ్చాపురం వరకు నేషనల్ హైవే నెం.5 అభివృద్దికి,వెలుగు ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నిధులు రావడంలో,ఫుడ్ ఫర్ వర్క్ కింద 50వేల టన్నుల బియ్యం కేటాయింపులో, మైక్రో ఇరిగేషన్(బిందు,తుంపర సేద్యం) అభివృద్ధిలో, హైదరాబాద్ లో ఐటి రంగం అభివృద్ధికి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో వాజ్ పేయి సహకారం మరువలేనిది. మైక్రో ఇరిగేషన్ పై టాస్క్ ఫోర్స్ కు ఛైర్మన్ గా నన్ను నియమించినప్పుడు దేశంలో 3మిలియన్ హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ (డ్రిప్ ఇరిగేషన్ 2మిలియన్ హెక్టార్లు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ 1 మి.హెక్టార్లు) చేపట్టాలని అప్పట్లో ఇచ్చిన టాస్క్ ఫోర్స్ నివేదికలో పేర్కొన్నాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మైక్రో ఇరిగేషన్ ను 33లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలని సంకల్పంగా పెట్టుకున్నాం. వ్యక్తిగతంగా,పార్టీపరంగా నాకు వాజ్ పేయితో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆయన పరిపాలన,రాజకీయ అనుభవాలు ‘‘వాజ్ పేయి శకం’’గా భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది... (నారా చంద్రబాబు నాయుడు), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read