డిఎంకె అధినేత కరుణానిధి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కాకలు తీరిన రాజకీయ యోధుడిని దేశం కోల్పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది చంద్రబాబు సంతాప సందేశం... "అటు సాహిత్య రంగం,చలన చిత్ర రంగం,పత్రికా రంగం,రాజకీయ రంగంలో ఘనాపాఠి. తన సేవాభావం,పాలనా అనుభవంతో తమిళ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. కవి రచయితగా,కళాకారునిగా,పత్రికా సంపాదకునిగా,రాజకీయ వేత్తగా,పరిపాలకుడిగా చెరగని ముద్రవేశారు. కరుణానిధి మృతి తమిళనాడుకే కాదు భారతదేశానికే తీరనిలోటు. నిరుపేదలు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించారు.

cbnsantapam07082018 1

5సార్లు ముఖ్యమంత్రిగా,13సార్లు శాసనసభ్యునిగా,50ఏళ్ళు పార్టీ అధ్యక్షునిగా, 75ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం,మార్గదర్శకం. తాను నమ్మిన ద్రవిడ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లారు. తన రచనల్లో,రాజకీయంలో,పరిపాలనలో ప్రతిబింబించారు. నిజ జీవితంలో ఆచరించి చూపించారు. ఆయన జీవిత కాలం తమిళనాట కరుణానిధి శకంగా మిగిలిపోతుంది. కరుణానిధి కుటుంబ సభ్యులకు,డిఎంకె కార్యకర్తలకు,తమిళ ప్రజలకు ప్రగాఢ సానుభూతి.". కాగా, కరుణానిధి మృతికి ఏపీ మంత్రి నారా లోకేశ్, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా తమ సంతాపం తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read