ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఉదయం అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలకు వెళ్ళటం చంద్రబాబుకి ఆనవాయతీ. ఈ సారి కూడా నాలుగు రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లి, అక్కడ వైద్య పరీక్షలు చేయించుకుని, ఈ రోజు ఉదయమే చంద్రబాబు తిరిగి హైదరాబాద్ వచ్చారు. సోమవారం ఉదయం అమరావతి వస్తారాని సమాచారం. అయితే అమెరికా నుంచి రాగానే జెట్ ల్యాగ్ కూడా లేకుండా, చంద్రబాబు పార్టీ సమీక్షలు చేసారు. కొద్ది సేపటి క్రితం, చంద్రబాబు, మాజీ కేంద్రం మంత్రి జైపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్ళే రోజే, జైపాల్ రెడ్డి మరణించారు. అయితే అప్పటికే షడ్యుల్ ఉండటంతో, చంద్రబాబు పరామర్శకు వెళ్ళలేక పోయారు.

revanth 03082019 2

ఈ నేపధ్యంలో అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన రోజే, ఆయాన జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించటానికి, ఆయన ఇంటికీ వచ్చారు. జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు చంద్రబాబు. కుటుంబ సభ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నట్టు ఉండి ఇలా ఎందుకు జరిగింది అనే విషయాలు తెలుసుకున్నారు. జైపాల్ రెడ్డితో తనకు, తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారు. ఈ సందర్భంలో, అక్కడ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి కి బంధువు అన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోసం, అప్పటికే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు రాగానే, ఆయనను దగ్గర ఉండి జైపాల్ రెడ్డి ఇంట్లోకి తీసుకువెళ్ళారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యలను, చంద్రబాబుకు పరిచయం చేసారు రేవంత్ రెడ్డి.

revanth 03082019 3

రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న టైంలో, ఓటుకు నోటు కేసు రావటం, అందరూ చేసే పనే అయినా, రేవంత్ ను టార్గెట్ చేసి, ఉచ్చులోకి దింపి, జైలుకు పంపటం ఇవన్నీ జరిగిపోయాయి. చివరకు రేవంత్ కూతురు నిశ్చితార్దానికి కూడా రేవంత్ బెయిల్ పై రావాల్సిన పరిస్థితి రావటంతో, చంద్రబాబు దంపతులు ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి చేసిన సంగతి తెలిసిందే. తరువాత క్రమంలో, తెలుగుదేశం పార్టీ తెలంగాణాలో రాజకీయంగా ఇబ్బందుల్లో ఉండటంతో, రేవంత్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రేవంత్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తరువాత, చంద్రబాబుని మళ్ళీ ఇప్పుడే కలుసుకున్నారు. ఇది సందర్భం కాకపోయినా, చంద్రబాబు, రేవంత్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి, టిడిపి శ్రేణులు హర్షిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read