ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర, ప్రశాంత్ కిషోర్ ఫేక్ బ్యాచ్ , జగన్ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారాల పై, తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఎటాక్ కు సిద్ధమవుతుంది. మొన్నటి వరకు వీటిని పెద్దగా పట్టించుకోకుండా పలాన చేస్తూ వెళ్తున్న అధికార పక్షం, ఇక గట్టి కౌంటర్ ఎటాక్ ఇవ్వటానికి సిద్ధమైంది... టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ అంశం పై దృష్టిసారించారు. ఎత్తుకు పైఎత్తు వేసే క్రమంలో టీడీపీ కూడా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనలో ఉంది. ఇందులో టీడీపీ అధినేత మినీ పాదయాత్రలు బహిరంగ సభలు కూడా నిర్వహించాలనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.
నవంబర్ నెలలో కొత్త కార్యాచరణకు తెర లేపే దిశగా కసరత్తు సాగుతోంది. విపక్ష నేత సభలంటే తెలుగుదేశం పార్టీ పై అధినేత పై పెద్ద ఎత్తున విమర్శలు ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే విరుగుడుగా లబ్ధి పొందిన రైతాంగం, సానిక ప్రజానీకాన్ని మమేకం చేస్తూ, వారి చేతే నిజాలు చెప్పించి పోజిటివ్ వేవ్ క్రియేట్ చేస్తారు... జగన్ స్పీడ్ కు బ్రేక్లు వేయడం కోసమే పాలకపక్షం కొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. వివిధ జిలాల్లో నిర్వహించనున్న పాదయాత్రలో భాగంగా జగన్ ప్రస్తావించే అంశాలకు వెంటనే సమాధానం ఇచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించే అవకాశాలున్నాయి.
చంద్రబాబు మినీ పాదయాత్రలు, బహిరంగ సభలో భాగంగా మూడున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి... పై విస్తృతంగా వివరిస్తారు. అన్ని జిలాల్లో పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలని. అవి అర్ధవంతంగా ఉండాలనేది పార్టీ అధినేత వ్యూహంగా మారింది. వచ్చే ఎన్నికలో విజయం సాధించి మళ్ళీ అధికారంలోకి రావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాడర్ను అప్రమత్తం చేయడంలో ముందున్నారు. ఏయే ప్రాంతాలోపార్టీ బలహీనంగా ఉన్నది. ఇంటింటికీ తెలుగుదేశం పురోగతి పై లోతుగా చర్చిస్తున్నారు. 80 శాతం తగ్గకుండా ప్రజల ఆమోదం టీడీపీ పాలన పై ఉండాలని చంద్రబాబు ఉద్దేశం. దానికి తగ్గట్టుగా, చేసిన మంచి చెప్పుంటే చాలు, ప్రజలు మనవైపే ఉంటారు అనేది చంద్రబాబు ప్రధాన ఉద్దేశం...