2019 లో టీడీపీ ఫినిష్ అంటూ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. 2019లో టీడీపీ పని అయిపోతుందని బీజేపీ నేతలు అంటున్నారని, తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన అన్నారు. బీజేపీ నేతలవి ప్రగల్భాలేనని అన్నారు. ‘‘ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు.. 2019లో తెలుగుదేశం పార్టీ ఫినిష్.. అయిపోయింది. ఇంకొకపక్క మనకు చుక్కలు చూపిస్తామని మాట్లాడారు. ఈనెల 15వ తేదీ తర్వాత మనకు చుక్కలు చూపిస్తామని, ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికే పరిస్థితికి వచ్చారంటే... ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నమన్న అంశం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని’’ చంద్రబాబు అన్నారు. ఎవరూ తెలుగు దేశం పార్టీని ఏమీ చేయలేరని.. ఆ విషయం బీజేపీ గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.

tdp 11052018 1

తాను న్యాయం చేయమని అడిగామని, కేంద్రం న్యాయం చేయలేదని, అన్యాయం చేసిందని, ఏపీ కూడా దేశంలో భాగమేనని చంద్రబాబు అన్నారు. తమకూ హక్కులున్నాయన్నారు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేశారని, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందని, దాన్ని సరిదిద్దుతానని, అన్ని విధాల ఏపీకి అండగా ఉంటానని నరేంద్రమోది హామీ ఇచ్చారని, ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన రాజధాని కడతామని, ఢిల్లీ కూడ చిన్నబోయిట్టు చేస్తామని చెప్పి... పటేల్ విగ్రహానికి రూ. 2500 కోట్లు ఇచ్చి, ఏపీకి రూ. 1500 కోట్లు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు.

tdp 11052018 1

రాజధాని ఎలా కట్టాలని ప్రశ్నించారు. రైతులు ఇచ్చిన స్సూర్తితో రూ. 50 వేల కోట్ల విలువైన భూమి ల్యాండ్ పూలింగ్ చేస్తే... కేంద్రం రూ. 1500 కోట్లు ఇచ్చి.. యూసీలు పంపలేదని తమపై బురద జల్లే కార్యక్రమం చేస్తోందని సీఎం మండిపడ్డారు. ఆ రాజధాని వస్తే ఎక్కువ డబ్బులు కేంద్రానికే పోతాయని ఆయన అన్నారు. మరో పక్క జీవీఎల్‌ వ్యాఖ్యల పై, మంత్రి సోమిరెడ్డి కూడా స్పందించారు... ఎంపీ జీవీఎల్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. చంద్రబాబుకు కాదు.. జీవీఎల్‌కే త్వరలో చుక్కలు కనిపిస్తాయన్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిచ్చారు. మోదీ, అమిత్‌షాకు ప్రజలు బుద్ధిచెప్పాలని మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read