కౌంటింగ్ గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కంటిమీద కునుకు కరువైంది. ఓటరు దేవుడు తమపై ఏ మాత్రం కరుణించాడో ఇప్పటికీ తేలకపోవడంతో అభ్యర్థులు, పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డారు. అధికారమే లక్ష్యంగా తెలుగుదేశం, వైకాపాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతుంటే జనసేన తాము కూడా కీలకమేనని భావిస్తోంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఈ నెల 23న తేలిపోనుంది. అంటే మరో 11 రోజుల పాటు ఈ ఉత్కంఠత కొనసా గనుంది. ఇప్పటికే వివిధ సర్వేలు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్నాయి. కొన్ని సర్వేలు అధికార పార్టీ అయిన తెలుగు దేశానికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని వైకాపాకు అనుకూలం గా వస్తున్నాయి. వివిధ సంస్థల పేరిట షికారు చేస్తున్న ఈ సర్వేలు అభ్యర్థుల్లో ఆందోళన రేక్కెత్తిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మరోవైపు ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో నివేదికలతో గెలుపు, ఓటముల అంచ నాలపై ఒక అవగాహనకు వస్తున్నాయి. మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదలై దేశవ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిం చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఐదు దశల్లో పోలింగ్ పూర్తికాగా, ఆదివారం ఆరవ విడత పోలింగ్ జరగ నుండగా, ఈ నెల 19న చివరి విడతతో పోలింగ్ ముగియ నుంది. ఆదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు ఎవరికి అధికారం దక్కునున్నదో అనే అంశంపై కొంత మేర స్పష్టత వచ్చే అవకాశాలు న్నాయి. ఈ నెల 23న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అయితే ఓటరు తీర్పు ఏవిధం గా ఉంటుందోనన్న వాస్తవ రూపం తెలియాలంటే మరో 11 రోజలు ఓపిక పట్టాల్సిందే. ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్న అంచనాలను రూపొందించే పనిలో ప్రధాన పార్టీలు వున్నాయి. మరోవైపు అభ్యర్థు లు ఎవరి లెక్కల్లో వారున్నారు. పార్టీలు, అభ్యర్థులు తమకు తోచిన విధంగా, తమకున్న విశ్లేషణా పరిజ్ఞానం ద్వారా క్షేత్రస్థాయి లెక్కలు వేస్తూ గెలుపు, అధిక్యతపై అంచనాలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
రెండు ప్రధాన పార్టీలు పూర్తి స్థాయిలో లెక్కలు కడుతున్నాయి. తెలుగుదేశం ఒక నమూనాలో లెక్కలు వేస్తుండగా, ప్రధాన ప్రత్యర్థి వైకాపా ఇప్పటికే బూత్‌ల వారీగా నాయకులతో సమీక్షలు నిర్వహించి ఒక అంచనాకు వచ్చింది. ఈ నెల 4 నుంచి తెలు గుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో బూత్‌లవారీగా పనిచేసిన నాయ కులు జాబితా, ఎవరెవరు ఎలా పనిచేశారు? ఏజెంట్ల బాధ్యత లు ఏలా ఉన్నాయి, బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తు న్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుండటంతో ద్వితీయ శ్రేణి నేతల్లో కొంత ఉత్సా హాన్ని కలిగించింది. తమ నియోజకవర్గాల్లో జరిగిన వాస్తవ పరిస్థితులను అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువచ్చే అవకాశం లభించడంతో వారి ఆనందం అంత ఇంతాకాదు. అదేవిధంగా వారు చెబుతున్న ప్రతి విషయాన్ని అధినేత కూడా సమగ్రంగా విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ ముఖ్యనేతలు, అభ్యర్థులు చేసిన తప్పిదాలు, పొరపాట్లను ఈ సమీక్షల్లో చంద్రబాబు విశ్లేషిస్తునే భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కౌటింగ్‌కు సంబంధించి ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ప్రతి రోజు అధినేత చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కౌంటింగ్‌కు సమాయత్తం చేస్తున్నారు. ప్రతి రోజు కౌంటింగ్ సమయంలోఎలా వ్యవహరించాలో దిశానిర్థేశం చేస్తున్నారు. ఫలితాలు వెల్లడి అయ్యేంత వరకు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లలో అనుభవజ్ఞులతో పాటు, న్యాయవాది, సాంకేతిక సలహాదారులను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.