ఈ రోజు ఉదయం అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు రెండు కీలక నిర్ణయాలు తీసుకుని, అటు మోడీతో పాటు, ఇటు మోడీ కొత్త స్నేహితులకు కూడా దిమ్మ తిరిగే అడుగు వేసారు... లోక్ సభలో ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం సభ్యులే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఎంపీలను ఆదేశించి షాక్ ఇచ్చారు... నిన్నటి వరకూ తమ అవిశ్వాసానికి మద్దతిస్తారని ఆశించి.. మద్దతిస్తామని చంద్రబాబు ప్రకటించడంతో హోదా కోసం తామే అవిశ్వాసం పెట్టామని చెప్పుకోవాలన్న వైసీపీ, ఆయన కొత్త స్నేహితులు ఆశలపై తాజా నిర్ణయంతో చంద్రబాబు నీళ్లు చల్లారు.

cbn 16032018 2

చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో వైసీపీ, ఆయన కొత్త స్నేహితులు డైలమాలో పడ్డారు. వైసీపీ కుట్రపూరితంగానే అవిశ్వాసం పెడుతోందని భావించే చంద్రబాబు మద్దతుపై యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఎన్డీఏతో కూడా తెగతెంపులు చేసుకోవాలని టీడీపీ నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా జరుగున్న పరిణామాలతో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్టీయేకు గుడ్ బై చెప్పింది. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరిలతో రాజీనామా చేయించిన టీడీపీ అధిష్టానం చివరకు ఎన్డీయేలో కొనసాగరాదని నిర్ణయం తీసుకుంది.

cbn 16032018 3

సాయంత్రం అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీయేతో తెగదెంపుల విషయంపై పార్టీ ముఖ్యులతో చర్చించారని, అయితే.. తెగదెంపులకే ఎక్కువగా మొగ్గు చూపడంతో చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పారని వార్తలు వెలువడుతున్నాయి. ఇక ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి, కొత్త వ్యక్తులతో రాష్ట్రం పై ఎలా కుట్ర జరుగుతుంది, అలాగే జరుగుతున్న రాజకీయ మార్పుల గురించి చెబుదామని ఆయన అన్నారు. ఇక ఎన్డీయే నుంచి తాము వైదొలిగామన్న సంగతిని స్పీకర్ కు, రాష్ట్రపతికి తెలియజేయాలని చంద్రబాబు ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read