కేవలం చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, మోడీ పై అవిశ్వాసం అంటూ జగన మోహన్ రెడ్డితో పాటు, అతని స్నేహితులు ఆడిన డ్రామాలు చూస్తూనే ఉన్నాం... ఒక పక్క మోడీకి విశ్వాసం అంటూ, మళ్ళీ అవిశ్వాసం అంటూ డ్రామాలు ఆడారు... ఇక కొంత మంది అయితే, మోడీ అనే పేరు పలికి కొన్ని నెలలు అయిపొయింది... ఈ సందర్భంలో, మోడీ పేరు చెప్పి మరీ, చంద్రబాబు లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తూ, మనకు చేసిన అన్యాయాన్ని దేశానికి చాటి చెప్పారు... అయితే, చంద్రబాబుని ఇబ్బంది పెడదాం అని, మార్చ్ 21న కాకుండా, ప్రస్తుతం రాజాకీయ వాతావరణం ఉపయోగించుకోవటానికి, రేపే అవిశ్వాసం పెట్టారు.. అయితే, చంద్రబాబు వీళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు...
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించింది. అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్ నేతలతో సీఎం తన ఛాంబర్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో జగన్ జగన్ & కో కి, గొంతులో పచ్చి వెలక్కాయ్ పడింది... చంద్రబాబుని ఇరుకున పెడదాం అని, వారే ఇప్పుడు ఇరుకున పడ్డారు... చంద్రబాబు ధైర్యంగా, మోడీ మీద ఎదురు తిరగ గలరు... కాని, జగన్ బ్యాచ్, మోడీ మీద విశ్వాసం లేదు అని రికార్డెడ్ గా చెప్పే దమ్ము ఉందా ?
అంతే కాదు, చంద్రబాబు మరో డైరెక్షన్ కూడా ఇచ్చారు... వైకాపా భాజపాతో కలిసే ఈ అవిశ్వాసం నాటకం ఆడుతోందని, వీరిద్దరూ ఆడుతున్న నాటకాలు అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్ లోనే ఎండగట్టాలని చెప్పారు... రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్న వనరులన్నింటినీ వాడుకోవాలని సీఎం నేతలతో అన్నారు. రాజకీయాలకతీతంగా వ్యవహరిస్తున్నామనే సంకేతాన్ని కేంద్రానికి తెలియజేయాలని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఇందులో భాగంగానే కేంద్రంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని నిర్ణయించారు.