ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం తీరును నిరసిస్తూ దిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం కోసం దీక్ష చేసిన వేదిక (ఏపీ భవన్‌) నుంచే మరోసారి చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఎన్డీయే మధ్యంతర బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచెయ్యి చూపడంతో సీఎం చంద్రబాబు ఈ సారి దిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించారు. దీంతో దేశరాజధానిలోని ఏపీ భవన్‌ వేదికగా ఈ రోజు దీక్షను ప్రారంభించారు. నల్లచొక్కాతో దీక్షకు హాజరయ్యారు. అంతకుముందు సీఎం చంద్రబాబు రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మ గాంధీకి నివాళులర్పించారు.

deeksha 11022019 1

ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. దీక్షా వేదికపై గాంధీ, అంబేడ్కర్‌, ఎన్టీఆర్‌ చిత్ర పటాలకు చంద్రబాబు నివాళులర్పించారు. రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఈ దీక్షకు ఏపీ నుంచి వేలాది మంది ప్రజలు, ప్రజాప్రతినిధులతో పాటు పలు జాతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. వివిధ తెలుగు సంఘాలు, విద్యార్థి సంఘాలు దీక్షకు మద్దతు పలికాయి. నల్లచొక్కాలతో టీడీపీ నేతలు దీక్షా స్థలికి తరలివచ్చారు. ప్రత్యేక హోదా నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తుతోంది. బాబు దీక్షకు 23 పార్టీల నేతలు సంఘీభావం తెలుపనున్నాయి. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి, ఏపీ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు సహా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.

deeksha 11022019 1

మీడియా కోసం ప్రత్యేక లాంజ్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన 26 మంది మంత్రులు, 104 మంది ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్సీలు, 20 మంది పార్టీ ఎంపీలు, మరో 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు, 150 మంది పార్టీ ముఖ్య నేతలు, 150 మంది పార్టీ కార్యవర్గ సభ్యులు ధర్మ పోరాట దీక్షలో పాల్గొంటున్నారు. ఢిల్లీకి చెందిన తెలుగు సంఘాలు, ఎన్జీవోలు, పౌర సంఘాలకు చెందిన సుమారు 4,000 మంది హాజరవుతారని టీడీపీ అంచనా వే స్తోంది. మంత్రులు, ఇతర ముఖ్యుల కోసం దేశ రాజధానిలోని వివిధ హోటళ్లు, హాస్టళ్లు, టీటీడీ గె స్ట్‌ హౌస్‌లో వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. కార్యకర్తలకు వసతి, రవాణా, ఫుడ్‌ కోర్ట్‌, సాంకేతిక సహాయం, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌ వద్ద హెల్ప్‌ డెస్క్‌ కోసం లైజన్‌ ఆఫీసర్లను నియమించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read