ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఒకరోజు ముందు బీజేపీయేతర పక్షాల సమావేశం జరుగనుండటంపై సర్వత్రా చర్చజరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని గద్దె దించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఏకైక అజెండాతో సమావేశం నిర్వహిస్తున్నారు. గత నెలలో జాతీయస్థాయి ప్రతిపక్ష అధిపతులు, ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన చర్చల పర్యావసానం దేశంలో బీజేపీయేతర పార్టీలలో ఐక్యత, ఉమ్మడి కార్యాచరణకు మలి విడత సమావేశం నిర్వహిస్తున్నారు. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరికొత్త ఫ్రంట్ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకభూమిక వహించనున్నారు. దిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశానికి సోనియా, మన్మోహన్ సింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కూటమి పేరు, ఎజెండా నిర్ణయిస్తారని భావిస్తున్నారు. ప్రజా ప్రంట్ అనే పేరు ఉంటుందా.. మరేదైనా పేరా అనేది నిర్ణయిస్తారు.
ఏడు రాష్ట్రాల సీఎంలతో సహా.. ఇతర పార్టీల ముఖ్య నేతలు హాజరవుతారు. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సరికొత్త ఫ్రంట్ ను రూపోమ్దిమ్చాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. మరోపక్క పార్లమెంట్ సమావేశాలు మొదలవనున్నాయి. జనవరి 8 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల ఫలితాల వేళ శీతాకాల సమావేశాలు వేడి పుట్టించనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వాన్ని , అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీయనున్నాయి. మోదీ ప్రభుత్వానికి పూర్తికాల చివరి సమావేశం ఇదే. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తప్పదని దేశ ప్రజలు ఆశిస్తున్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు సమావేశంలో తీసుకునే నిర్ణయాలు దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించనున్నాయి.
దేశ ప్రజలు నియంత పాలనను అంగీకరించరని ఎలుగెత్తి చాటనున్నారు. పార్లమెంటు అనుబంధ భవనంలో మధ్యాహ్నం 3.30 గంటలకు కీలక సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో సోనియాగాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు మన్మోహన్‌సింగ్, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే నేత స్టాలిన్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఎన్‌సీ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్, ఆర్‌జేడీ యువనేత తేజస్వియాదవ్, ఝార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎ నేత హేమంత్ సోరెన్, ఝార్ఖండ్ వికాస్ మోర్చా అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ, లోక్‌తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నేత ఉపేంద్రకుష్వాహా, అసోం యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ నేత బద్రుద్దీన్ అజ్మల్ -కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అమరీందర్‌సింగ్ (పంజాబ్), నారాయణస్వామి(పుదుచ్చేరి)లతో పాటు కర్ణాటక సీఎం కుమారస్వామి, ఎల్డీఎఫ్ సీఎం పినరయి విజయన్(కేరళ)లనూ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.