చంద్రబాబు ఢిల్లీ పర్యటన మొదలైంది... నేషనల్ మీడియా మొత్తం చంద్రబాబు చుట్టూతా ఉండి హడావిడి చేస్తుంది... మరో పక్క చంద్రబాబు ప్రముఖ నేతలను కలిసి, మనకు జరిగిన అన్యాయం వివరించి, వారి మద్దతు కూడగడుతున్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పార్లమెంటుకు చేరుకున్నారు. ముందుగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలతో కలిసి చంద్రబాబు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్లమెంటు ప్రధాన ద్వారం ముందు ఉన్న మెట్లకు నమస్కరించారు. పార్లమెంటు ఓ సారి చూసిన చంద్రబాబు ఇది ప్రజాస్వామ్య దేవాలయం అంటూ లోపలకి అడుగుపెట్టారు. ఈ సమయంలో టీడీపీ ఎంపీలు ‘జై తెలుగుదేశం’, ‘జై జన్మభూమి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.

cbn delhi 03042018 1

మోదీ సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన బీజేపీయేతర పార్టీల ఫ్లోర్‌లీడర్లను పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లను కోరారు. ఫరూక్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్‌రెడ్డి, వీరప్పమొయిలీ, రాజీవ్‌ సాతీవ్‌‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌ను చంద్రబాబు కలుసుకున్నారు. ఈ సందర్భంగా, శరద్ పవార్ మాట్లాడుతూ, మీరు 29 సార్లు ఢిల్లీ వచ్చింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నారు.. అయితే చంద్రబాబు మాత్రం, నా తక్షణ కర్తవ్యం, రాష్ట్రానికి మేలు జరగటమే అని, మిగిలినవి తరువాత మాట్లాడుకుందాం అని చెప్పారు... విభజన చట్టం, హామీల అమలు, ప్రత్యేక హోదాపై రూపొందించిన వివరణ పత్రాన్ని అందిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

cbn delhi 03042018 1

మరో పక్క, అన్నాడీఎంకే ఫ్లోర్‌లీడర్ వేణుగోపాల్‌తో మాట్లాడారు. మనమంతా దక్షిణ భారతీయులమని... ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన వేణుగోపాల్ తమ పార్టీ అధిష్టానంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని...పార్టీ అధినేతతో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని తెలుపుతామని చంద్రబాబుకు తెలియజేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read