ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. నిన్న ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వటం, ఈ రోజు ఎన్నికల నియమావళి అమలు లోకి రావటంతో, ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయ్యింది. అధికార వైసీపీ ఇప్పుడు ఎన్నికలు మేము ఒప్పుకోం అని చెప్తున్నా, కోర్టుల్లో వీరి వాదన నెగ్గే అవకాసం లేదు. ఎందుకంటే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని, కోర్టులు కాదనే అవకాసం లేదని, మొన్నే కేరళ విషయంలో చూసాం. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తం అయ్యింది. ఈ రోజు చంద్రబాబు రాష్ట్రంలోని సీనియర్ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో పాల్గున్నారు. ఈ సమవేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు, ఇతర ముఖ్య నేతలు పాల్గున్నారు. ఎన్నికల నేపధ్యంలో వారికి చంద్రబాబు దేశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను స్వాగతించారు. ఇవి జరిగితే జగన్ బండారం బయట పడుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తే, జగన్ కు ఒక బ్రేక్ వస్తుందని, పెంచిన చార్జీలు దగ్గర నుంచి, పన్నుల దగ్గర నుంచి,ర రైతులకు మోటార్ల మీటర్ల దాకా అన్నిటి పై వెనక్కు తగ్గుతాడని అన్నారు. ఎన్నికలు అనేవి నిర్ణయించేది రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ అని అన్నారు. దీనికి జగన్ మోహన్ రెడ్డికి ఏమి సంబంధం ఉండదని అన్నారు.
ఎన్నికల సంఘాన్ని నియంత్రించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ఉద్యోగులు, పోలీస్ వారు కూడా, సహకరించాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదని అన్నారు. ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరపాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ ముందు పలు సంచలన డిమాండ్స్ పెట్టారు. ఆన్లైన్ లో కూడా నామినేషన్లు వేసే విధంగా ఏర్పాటు చేయాలనీ అన్నారు. తద్వారా వీళ్ళు బలవంతంగా ఎత్తుకుని వెళ్ళే అవకాసం ఉందని అన్నారు. ఇక కేంద్ర బలగాలు పర్యవేక్షణలో మాత్రమే ఎన్నికలు జరగాలని అన్నారు. అలాగే గ్రావ వాలంటీర్లును ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేయ కూడదు అని చంద్రబాబు డిమాండ్ చేసారు. గతంలో ఎన్నికల కమిషన్ కొంత మంది అధికారుల పై చర్యలు తీసుకుందని, వారిని ఈ ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని అన్నారు. ప్రభుత్వ భావనల పై వైసీపీ రంగులు తీయాలని డిమాండ్ చేసారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని అన్నారు. అలాగే గతంలో బలవంతంగా చేసిన ఏకాగ్రీవాలు అన్నీ రద్దు చేయాలని అన్నారు. అన్ని స్థానాలకు మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.