కేంద్రం పై విపక్షాలు అన్నీ ఏకం అయ్యాయి... ఇప్పటికే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా తాజాగా ఆ జాబితాలో సీపీఎం కూడా చేరింది... తృణమూల్ కాంగ్రెస్ కూడా రేపు నోటీసు ఇవ్వనుంది.. జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, సీపీఎం అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తప్పకుండా అవిశ్వాసం ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ రేపు అవిశ్వాసం పై చర్చకు రెడీ అవుతుంది... దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు... లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

cbn mps 26032018

రేపటి సభకు ఎంపీలంతా హాజరై అవిశ్వాసంపై చర్చకు పట్టుబట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తెదేపా, వైకాపాతో పాటు కాంగ్రెస్‌, సీపీఎం కూడా అవిశ్వాస నోటీసులు ఇచ్చాయని చెప్పిన ముఖ్యమంత్రి.. లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చను చేపట్టే అవకాశం ఉందన్నారు. ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసంపై చర్చను చేపట్టవచ్చన్నారు. ఈ చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనదని, లోక్‌సభ వేదికగా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలని ఆదేశించారు. ఇది చాలా కీలక సమయమని, అవిశ్వాసంపై చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమన్నారు.

cbn mps 26032018

పార్టీ ఎంపీలంతా ఈ రాత్రికే దిల్లీ చేరుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రేపటి సభకు పసుపు చొక్కాలు, కండువాలతో హాజరుకావాలన్నారు. అవిశ్వాస తీర్మానం మంగళవారం చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీకి సహకరించాలని కోరాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి అందరికీ వివరించాలని, తమ వద్ద ఉన్న సమాచారం అంతా ఆయా పార్టీల నేతలకు ఇవ్వాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఒంటరి చేయాలనే భాజపా ప్రయత్నాలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచించారు. ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. దిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తోందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో భాజపా దుష్ప్రచారన్ని అధికం చేసిందని, దీనిపై ఎవరూ అధైర్య పడొద్దని, వెనుకంజ వేయొద్దని నిర్దేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read