విశాఖ వేదికగా మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు రాలేదు.. తప్పుడు లెక్కలు చూపిస్తున్నారంటూ కొందరు చేస్తోన్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖలో భాగస్వామ్య సదస్సు వివరాలను ఆయన అమరావతిలో మీడియాకు వెల్లడించారు. ఇదే సందర్భంలో జగన్ పై, ఒక కొత్త డౌట్ లేవనెత్తారు చంద్రబాబు... జగన్, హోదా తప్ప వేరే అంశం మాట్లాడటం లేదు, దీంట్లో మర్మం ఏమిటో అని అన్నారు... పోలవరం గురించి ఎందుకు మాట్లాడాడు అని అన్నారు...
హోదా సెంటిమెంట్ తో రాజకీయలాభం పొందాలని జగన్ చూస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు... విభజన చట్టం లోని 19 అంశాలతో పటు, మన్మోహన్ సింగ్ ఇచ్చిన 6 హామీలలో 5 వదిలేసి, కేవలం దాను మాత్రమే సెంటిమెంట్ గా పెంచి లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తోంది అని అన్నారు.. ఏ నాడు పోలవరం గురించి మాట్లాడడు, ఆర్ధిక లోటు గురించి మాట్లాడడు, EAP ప్రాజెక్ట్ లలో రావాల్సిన నిధులు గురించి మాట్లాడడు, హైదరాబాద్ లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభాజన్ గురించి మాట్లాడడు, కేవలం ప్రజల్లో భావోద్వేగం రగిలించటానికి, హోదా అంటాడు అంటూ, దుయ్యబట్టారు.. జగన్ కు రాజకీయ లాభాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనం వారికి పట్టదనేది రుజువైంది అని చంద్రబాబు అన్నారు..
విభజనచట్టంలో పేర్కొన్నవన్నీ కేంద్రం ఇవ్వాల్సిందేనని చంద్రబాబు అన్నారు. తప్పించుకొనే ప్రయత్నం చేస్తే మాత్రం సరికాదని తెలిపారు. విభజన హామీలను సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. ఇందుకోసం సంఘటితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదనడం సరికాదన్నారు. స్వశక్తితో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మన పని మనం చేసుకుంటూనే కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. నిర్మాణాత్మకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.