ఒక పక్క అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రం చేస్తున్న అన్యాయం పై, రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పై అన్నీ చెప్పుకుంటూ, ఆవేశంగా ప్రసంగిస్తూ ప్రజల ఆకాంక్షను వినిపిస్తూ వస్తున్నారు... ఈ లోపు, నిన్న విజయసాయి రెడ్డి చేసిన పిచ్చి వాగుడు గురించి, చంద్రబాబు గుర్తుతెచ్చుకున్నారు... ఇంతలా కష్టపడుతూ, ఢిల్లీ పై పోరాటం చేస్తుంటే, అదే ఢిల్లీ నాయకుల కాళ్ళ మీద పడి, బయటకు వచ్చి, చనిపోయిన నా తల్లిదండ్రుల పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ, తన తల్లిని గుర్తు చేసుకుంటూ, చంద్రబాబు భావోద్వేగానికి గురైయ్యారు... కొంచెం సేపు మాట కూడా రాకుండా, అలా ఉండిపోయారు... 12 ఏళ్ళ కిత్రం రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు తల్లి గురించి, ఇలాంటి మాటలే మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే బాధపడ్డారు... మళ్ళీ 12 ఏళ్ళ తరువాత, ఈ రోజు మళ్ళీ ఆయన తల్లిని కించపరుస్తూ మాట్లాడిన మాటలతో చంద్రబాబు మరోసారి బాధపడ్డారు...
ఇది చంద్రబాబు తన తల్లిని గుర్తు చేసుకుని భావోద్వేగంతో మాట్లడిని మాటాలు "నిన్న చుస్తే, ఒక నిందితుడు, ప్రధాన మంత్రి కాళ్ళకి దండం పెట్టి, బయటకు వచ్చి, ఒక తండ్రికి, ఒక తల్లికి పుట్టినావడైతే అంటూ నన్ను సంభోదించాడు... మన సంస్కృతీ ఏంటి ? బాధ వెయ్యదా ? మనందరికీ తల్లి తండ్రి అంటే ఎంత ఎమోషన్ ఉంటుంది.. వారిని దేవుళ్ళతో సమానంగా చూస్తాం... వారు చనిపోతే కూడా, డీప్ సెంటిమెంట్ ఉంటుంది... వారి ఫోటోలకి దేవుళ్ళతో సమానంగా పూజిస్తాం.. వారి ఆత్మ, వారి ఆశీస్సులు మనతో ఉండాలని... సంక్రాంతి రోజున చనిపోయిన పెద్దలకు పండుగ చేస్తాం, మీ ఆశీస్సులు మాకు ఉండాలని ప్రార్దిస్తాం"
"అలాంటి సంస్కృతిలో, తల్లి దండ్రుల గురించి మాట్లాడే సంస్కృతి వీళ్ళది. ఎంత బాధ వేస్తుని, ఎంత ఆవేదన ఉంటుంది ? నేను మనిషినే, నాకు బాధ ఉంది, ఆవేదన ఉంది... మహిళలను గౌరవించి, తల్లిని ఆరధించే సమాజం మనిది... మా తల్లితో నా కోసం ఎంతో కష్టపడి, ఇంతవరకు పెంచింది... ప్రతి ఒక్కరికి తల్లితో సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది... అందరికీ ఉన్నట్టే, మా తల్లిని అంటే, మా తల్లిని కించపరిస్తే నాకు బాధ ఉంటుంది... అయనా పడతాను. ప్రజల కోసం పడతాను... నేను ఒక ఆశయం కోసం పని చేస్తున్నా, వారి కోసం ఇలాంటివి పడతాను" అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...