ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం సాయం చెయ్యని పరిస్థుతులు నేపధ్యంలో, అన్ని పార్టీలతో అఖిల సంఘాల సమావేశం నిర్వచించారు.. నిన్న ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, ఏపీ ఎన్జీవో సంఘం, ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి, ఆప్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌, సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌, గెజిటెడ్‌ అధికారుల సంఘం, ఏపీ ఫెడరేషన్‌ ఆఫ్‌ చాంబర్స్‌ అండ్‌ కామర్స్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది... 

cbn meeting 28032018 4

సీపీఎం నేత మధు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నాలుగేళ్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉంటే బాగుండేదని, మీరు ఎప్పుడో బయటకు రావాల్సింది, ఇప్పటి దాక ఎందుకు రాలేదు అంటూ, చంద్రబాబుని డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేసారు... అయితే చంద్రబాబు రెండు కాయితాలు ముందు పెట్టి, ఇవి చూడండి... ఫిబ్రవరి 4 నుంచి మా ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన మొదలు పెట్టారు... ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు...

cbn meeting 28032018 5

వీరి కక్ష ఇలా ఉంటుంది... నాలుగేళ్ల ముందు నేను బయటకు వచ్చి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి... పోలవరం అసలు మొదలే అయ్యేది కాదు... అమరావతికి ఎన్నో ఇబ్బందులు వచ్చేవి (పర్మిషన్ల గురించి)... నాలుగేళ్లు అయ్యాకనే మనకివ్వాల్సింది మనం అడిగితే ఇంత పెడసరిగా వెళుతున్న వారు తొలిరోజు నుంచే నేను దూకుడుగా వెళ్లివుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది కాదా. అలా చేసి వుంటే ‘సీయం కాస్త ఓపిక పట్టివుంటే బావుండేది, దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ప్రయోజనాలు రాబట్టుకుంటే బావుండేది. దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశార’ని అప్పుడు మీరే అనేవారు. ఇది పసిగుడ్డు లాంటి రాష్ట్రం. మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా ఉన్నాం. (లోక్‌సభలో కాంగ్రెస్, ఎఐఏడీఎంకే వివాదం గురించి) అందరూ కలిసి వుండాల్సిన మంచి వాతావరణాన్ని రాష్ట్రాలవారీగా రెచ్చగొట్టి కలుషితం చేస్తున్నారు అంటూ చంద్రబాబు సమాధానం ఇచ్చారు.. దీంతో, చంద్రబాబు చెప్పిన విషయానికి, ఎవరో ఎదురు చెప్పలేక పోయారు.. ఎందుకంటే అది వాస్తవం కాబాట్టి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read