40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు వ్యవహరా శైలి, సామాన్య రాజకీయ నాయకుల కంటే ఎంతో భిన్నం. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ, తన పని తాను చేసుకు పోతూ ఉంటారు. ఆయన మీద ఆరోపణలే కానీ, ఒక్కటి అంటే ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. మొన్నటి దాక, రెండు ఎకరాలు, రెండు వేల కోట్లు అని, సింగపూర్ హోటల్ అని, ఇలాంటి ఆరోపణలు చేసే వారు. మరో పక్క, రాజశేఖర్ రెడ్డితో పోలుస్తూ, చంద్రబాబు ఎవరికీ సహాయం చెయ్యరు అనే ప్రచారం చేసే వారు. నిజానికి అది తప్పు. చంద్రబాబు దోచుకునే వారికి సహాయం చెయ్యరు. కాని చాలా మందికి సహాయం చేసే వారు. విచిత్రం ఏమిటి అంటే, ఆ సహాయం చేసే వారే చంద్రబాబుకి ఎదురుతిరుగుతూ ఉంటారు. అప్పటి కెసిఆర్ నుంచి, ఇప్పటి ఐవైఆర్ దాకా అదే తీరు. బహుసా ఇది చంద్రబాబు జాతకం అనుకుంటా. తాను ఎవరికైతే సహాయం చేస్తారో, వారే ఆయనకు ఎదురు తిరుగుతారు.
తాజా సందర్భంలోకి వస్తే- రాష్ట్రప్రభుత్వ ప్రధార కార్యదర్శిగా పనిచేసిన ఐ.వై.ఆర్.కృష్ణారావు అంటే బాబుకి ఎంతో గౌరవం. పదవీ విరమణ తర్వాత ఆయనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని పలువురు సూచించారు. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కృష్ణారావుకి ఇచ్చారు. ఐ.వై.ఆర్.పై ఉన్న నమ్మకంతో ఆ కార్పొరేషన్‌కు వందకోట్ల రూపాయలు కేటాయించారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఐ.వై.ఆర్. తన రూటు మార్చరు. ఏపీ సర్కార్కీ, చంద్రబాబుకీ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్‌లు షేర్ చేశారు. తనకీ, ప్రభుత్వానికీ వ్యతిరేకంగా షేర్ చేసిన పోస్టింగ్‌లను చూసిన ముఖ్యమంత్రి ఐ.వై.ఆర్ని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పీఠం నుంచి తొలగించారు. ఆ తర్వాత ప్రభుత్వానికీ, చంద్రబాబుకీ వ్యతిరేకంగా కోర్టులలో ఆయన పిటీషన్లు వేయడం విచిత్ర పరిణామం
ఇదే కోవలో మరో పేరు కూడా ఉంది. నెలరోజులు మాత్రమే సర్వీస్ ఉన్నప్పటికీ, సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లంని ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టారు చంద్రబాబు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయనకు ప్రభుత్వం ఏదో ఒక పదవి కట్టబెడుతుందని ప్రచారం జరిగింది. చివరకు ఆయన సైతం ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టినట్టు వార్తలొచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు పరిస్థితి కూడా ఇదే! వైఎస్. ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో నిబంధనలకు విరుద్ధంగా కొండపైనున్న అర్చకుల క్వార్టర్స్‌లో యాగం చేసిన ఘనుడు రమణ దీక్షితులు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక కొండ దిగుతారని భావించారు. చంద్రబాబు మాత్రం తిరుమల అర్చకుల విషయంలో జోక్యం చేసుకోకూడదన్న భావనతో మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఇదే దీక్షితులు చంద్రబాబునే కాదు, ఆ వెంకన్న పరువే తీస్తున్నాడు..
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విషయాన్ని కూడా టీడీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత ప్రధాని పదవి చేపట్టిన మోదీ ఏపీ గవర్నర్‌గా నరసింహన్‌ను కొనసాగించాలా.. లేదా అనే అంశంపై చంద్రబాబును సంప్రదించినట్టుగా టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయననే కొనసాగించాలని చంద్రబాబు అప్పట్లో సూచించారట. అనంతరం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకంగా గవర్నర్ నరసింహన్ కేంద్రానికి నివేదికలు ఇచ్చారన్నది తెలుగు తమ్ముళ్ల కథనం. ఇక పవన్ సంగతి సరే సరి... కార్ వరకు వెళ్లి, పవన్ ను సాగనంపిన రోజలు ఉన్నాయి. ఇలా అనేక మంది, చంద్రబాబు ద్వారా లబ్ది పొంది, ఆయనకే గోతులు తవ్వుతున్నారు. వాళ్ళ సంగతి పూర్తిగా తెలుసుకోకుండా వారిని చేరదియ్యటం చంద్రబాబు తప్పా ? లేక కృతజ్ఞత లేకుండా ప్రవరిస్తున్న వారి తప్పా ?చంద్రబాబు జాతకమే అంత అనుకుంటా...